Close

15న ప్రతి గ్రామంలో స్వచ్ఛంధ్రా – స్వర్ణాంధ్ర జరగాలి కార్యక్రమం అర్థవంతంగా నిర్వహించాలి జిల్లా కలెక్టర్ కె.వెట్రిసెల్వి

Publish Date : 13/03/2025

ఏలూరు,మార్చి 13 : జిల్లాలో ఈ నెల 15వ తేదీన ప్రతీ గ్రామ, వార్డు సచివాలయాల పరిధిలో స్వచ్ఛంద్రా – స్వర్ణాంధ్ర కార్యక్రమం సమర్థవంతంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ కె.వె ట్రిసెల్వి తెలిపారు.

స్థానిక కలెక్టర్ క్యాంపు కార్యాలయం నుంచి గురువారం సబ్ కలెక్టర్లు, జిల్లా అధికారులు,రెవిన్యూ అధికారులతో కలెక్టర్ టేలి కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వం రూపొందించిన యాప్ నందు స్వచ్చంద్రా కార్యక్రమాల వివరాలను నమోదుచేయాలని కలెక్టర్ తహశీల్దార్లకు సూచించారు.
పర్యావరణానికి హాని కలిగించే ప్లాస్టిక్ ఉద్గారాలను పూర్తిగా నిషేధించాలని కలెక్టర్ చెప్పారు. ప్లాస్టిక్ వాడకాన్ని పూర్తిగా నిషేదించాలని, విక్రయాలను సైతం అరికట్టాలన్నారు. భూమిలో కుళ్లిపోయే పదార్థాలను మాత్రమే వినియోగించాలని కలెక్టర్ చెప్పారు. స్వచ్చాంధ్ర కార్యక్రమంలో భాగంగా ప్రతినెల మూడవ శనివారం ఒక అంశాన్ని ప్రామాణికంగా తీసుకుని పెద్ద ఎత్తున కార్యక్రమాన్ని నిర్వహిస్తుందన్నారు. కాలుష్యంతో దెబ్బతింటున్న
పర్యావరణాన్ని పరిరక్షించడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక దృష్టి సారించాయన్నారు. ఈనెల 15వ తేదీన జిల్లా వ్యాప్తంగా ఈ కార్యక్రమాలు జరుగుతాయన్నారు. ప్రజల భాగస్వామ్యంతో పెద్ద ఎత్తున కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు.ప్రతి ప్రభుత్వ కార్యాలయంలో స్వచ్ఛత కార్యక్రమం నిర్వహించాలని ఆదేశించారు. జిల్లాలోని అన్ని కళాశాలలు, పాఠశాలలు, ప్రభుత్వ వసతి గృహాలు, పరిశ్రమలు, ఆర్టీసీ బస్టాండ్, కూరగాయలు మార్కెట్, మార్కెట్ యార్డు, రైతు బజార్లు, దేవాలయాలు, పర్యాటక ప్రాంతాలు, ప్రజలు అధికంగా సంచరించే ప్రాంతాలు, ప్రధాన కూడళ్లలో పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపట్టాలన్నారు. పారిశుద్ధ్య కార్యక్రమాల ద్వారా పర్యావరణాన్నికి, ప్రజలకు కలిగే మేలుపై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. ప్రతి గ్రామంలో తాగునీటి చెరువులన్ని ఈ కార్యక్రమంతో పరిశుభ్రపరచాలన్నారు. పర్యావరణానికి హాని లేని వస్తువులను మాత్రమే ప్రజలు వినియోగించేలా చైతన్య కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. భూమిలో కలిసిపోయే పదార్థాలకు మాత్రమే ప్రాధాన్యత
నివ్వాలన్నారు. ఆయా శాఖల అధికారులు చేపట్టే ఈ కార్యక్రమాలను ఆన్ లైన్ లో పొందుపరచాలన్నారు. వారు నిర్వహించే కార్యక్రమాలకు ఫోటోలు తీసి స్వచ్చాంధ్ర వెబ్ సైట్ లో నిక్షిప్తం చేయాలన్నారు. ఈ కార్యక్రమాలపై రాష్ట్రస్థాయిలోనూ పర్యవేక్షణ ఉంటుందని వివరించారు. శ్రద్ధతో నిక్కచ్చిగా కార్యక్రమాలు నిర్వహించాలని పలు సూచనలు చేశారు.పరిశుభ్రమైన గ్రామం,మున్సిపాలిటీ,వార్డు, తదిరాలను గుర్తించి అవార్డులు కూడా ఇవ్వడం జరుగుతుందన్నారు.

అనంతరం మిస్సింగ్ ఎంప్లాయిస్ డేటా ఎంట్రీ పై ఆయా జిల్లా అధికారులతో కలెక్టర్ సమీక్షించారు. పోలీస్ ,విద్యా శాఖలో అత్యధికంగా నమోదు చేయవలసిందని ఈ విషయంపై వెంటనే ప్రత్యేక శ్రద్ధ తీసుకొని డేటా ఎంట్రీ పూర్తి చేయాలన్నారు.

సమావేశంలో అడిషనల్ ఎస్పీ ఎన్.సూర్యచంద్రరావు,నూజివీడు సబ్ కలెక్టర్ స్మరణరాజ్,ఆర్డీవోలు
జిల్లా రెవిన్యూ అధికారి వి.విశ్వేశ్వరరావు, వివిధ శాఖల జిల్లా అధికారులు,మండల తహశీల్దారు, తదితరులు పాల్గొన్నారు.