జిల్లాలో మూడో శనివారం సందర్భంగా స్వర్ణాంధ్ర – స్వచ్ఛాంధ్ర కార్యక్రమం
ఏలూరు ఎన్టీఆర్ పార్క్ వద్ద జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ కె.వెట్రిసెల్వి,ఏలూరు ఎమ్మెల్యే బడేటి రాధా కృష్ణయ్య, (చంటి),నగర మేయర్ షేక్ నూర్జహాన్ పెదబాబు, డిప్యూటీ మేయర్లు పప్పు ఉమామహేశ్వరరావు, వందనాల దుర్గాభవాని, ఏలూరు ఆర్డిఓ అచ్యుత్ అంబరీష్, డిఆర్డిఏ పిడి ఆర్. విజయరాజు, సెట్ వెల్ సిఇఓ ప్రభాకరరావు, మునిసిపల్ కమిషనర్ ఏ .భానుప్రతాప్, పలువురు కార్పొరేటర్లు, ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.
నగరాన్ని ప్లాస్టిక్ రహిత నగరంగా రూపొందిద్దామని పిలుపునిచ్చిన కలెక్టర్ కె.వెట్రిసెల్వి ,ఏలూరు ఎమ్మెల్యే బడేటి రాధా కృష్ణయ్య, (చంటి),నగర మేయర్ షేక్ నూర్జహాన్ పెదబాబు
ఈ నెల అంశమైన సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ను నిషేధిస్తాం- ప్లాస్టిక్ వస్తువులను నివారిస్తూ పునర్వినియోగ వస్తువుల ప్రోత్సహానికి సంబంధించి అంశంపై దుకాణాలకు వెళ్లి దుకాణాదారులకు,ప్రజలకు అవగాహన కల్పించారు. జ్యూట్, క్లాత్ బ్యాగులను వినియోగపై అవగాహన కల్పించారు.
నగర పాలకసంస్థ ఆధ్వర్యంలో ఆర్.ఆర్.పేట లో ప్లాస్టిక్ నిషేధంపై అవగాహన కార్యక్రమం
పరిసరాల పరిశుభ్రత కొరకు ప్రతిరోజు కొంతసమయం కేటాయిస్తామని స్వచ్ఛఆంధ్ర – స్వచ్ఛభారత్ ప్రతిజ్ఞ నిర్వహించిన జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి.