Close

ఈవిఎం గోడౌన్ ను తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి కె. వెట్రిసెల్వి..

Publish Date : 29/03/2025

ఏలూరు, మార్చి 29:జిల్లాకు సంబంధించి ఈవిఎంలను భధ్రపరచిన గోడౌన్ వద్ద నిరంతరం పటిష్టమైన భధ్రత ఉండాలని జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి కె. వెట్రిసెల్వి సంబంధిత అధికారులను ఆదేశించారు.

ఎన్నికల కమీషన్ ఆదేశాలు, మార్గదర్శకాల మేరకు త్రైమాసిక తనిఖీల్లో భాగంగా ఏలూరు కలెక్టరేట్ లో ఉన్న ఈవిఎం గోడౌన్ ను శనివారం రాజకీయ పార్టీల ప్రతినిధులతో కలిసి జిల్లా కలెక్టర్ తనిఖీ చేశారు. ఈ సందర్బంగా రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో గోడౌన్ లో భధ్రపరచిన ఈవిఎం యంత్రాలు బి.యు లు, సియు లు, వివిప్యాట్ లను, అక్కడి భధ్రతా ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ క్షుణంగా పరిశీలన చేశారు.

కార్యక్రమంలో జిల్లా రెవిన్యూ అధికారి వి.విశ్వేశ్వరరావు, ఏ.రతన్ కాంత్(బిఎస్పి)నెరుసు నెలరాజు(బిజెపి), పి బి.శర్మ,(ఐ ఎన్ సి)వి .స్టాన్లీ బాబు(వై ఎస్ ఆర్ సిపి) కలెక్టరేట్ ఎన్నికల విభాగం సిబ్బంది రాధా కృష్ణ, తదితరులు పాల్గొన్నారు.