ఘనంగా డా. బి.ఆర్. అంబేద్కర్ 134వ జయంతి వేడుకలు.
Publish Date : 14/04/2025
ఏలూరు, ఏప్రిల్, 14: భారత రత్న డా. బి.ఆర్. అంబేద్కర్ 134వ జయంతి సందర్బంగా ఏలూరు పాత బస్టాండ్ వద్దగల అంబేద్కర్ కాంస్య విగ్రహానికి ఇన్ చార్జి కలెక్టర్ పి. ధాత్రిరెడ్డి పూలమాల వేసి నివాళులు అర్పించారు. కార్యక్రమంలో దళిత నాయకులు దాసరి ఆంజనేయులు, మెండెం సంతోష కుమార్, మేతర అజేయ్ బాబు, జిల్లా రెవిన్యూ అధికారి వి. విశ్వేశ్వరరావు, సోషల్ వెల్ఫేర్ జెడి వి. జయప్రకాష్, ఏలూరు ఆర్డిఓ అచ్యత్ అంబరీష్, జిల్లా మైనారీటీ సంక్షేమ అధికారి ఎన్.ఎస్. కృపావరం, తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఇన్ చార్జి కలెక్టర్ ధాత్రిరెడ్డి మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి పాటుబడటంతోపాటు అందరి సంక్షేమం కోసం తన జీవితాన్ని ధారపోసిన త్యాగధనుడు డా. బి.ఆర్. అంబేద్కర్ అని పేర్కొన్నారు. సమాజానికి సమానత్వాన్ని ప్రసాధించిన గొప్పవ్యక్తి అన్నారు.