Close

రెవిన్యూ శాఖకు సంబంధించి పలు అంశాలపై రెవెన్యూ సిబ్బంది పూర్తి అవగాహన కలిగి ఉండాలని జిల్లా ఇంచార్జ్ కలెక్టర్ పి. ధాత్రి రెడ్డి రెవెన్యూ అధికారులకు సూచించారు.

Publish Date : 15/04/2025

ఏలూరు, ఏప్రిల్, 15: రెవిన్యూ శాఖకు సంబంధించి పలు అంశాలపై రెవెన్యూ సిబ్బంది పూర్తి అవగాహన కలిగి ఉండాలని జిల్లా ఇంచార్జ్ కలెక్టర్ పి. ధాత్రి రెడ్డి రెవెన్యూ అధికారులకు సూచించారు. కలెక్టర్ లోని గౌతమి సమావేశపు హలులో మంగళవారం రెవిన్యూ కు సంబంధించిన భూబదలాయింపులు, 22(A), అసైన్మెంట్, G.O.No:30 రెగ్యులేషన్, ROR చట్టాలలో సవరణలు, తదితర అంశాలపై సిబ్బందికి శిక్షణ కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఇన్చార్జి కలెక్టర్ ధాత్రిరెడ్డి మాట్లాడుతూ రెవెన్యూ శాఖకు సంబంధించి రెవిన్యూ కు సంబంధించిన భూబదలాయింపులు, 22(A), అసైన్మెంట్, G.O.No:30 రెగ్యులేషన్, ROR చట్టాలలో సవరణలు, తదితర అంశాలపై రాష్ట్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు జారీ చేసే నిబంధనలు, తదితర అంశాలపై రెవెన్యూ సిబ్బంది పూర్తిస్థాయిలో అవగాహన కలిగి ఉండాలన్నారు. సమావేశంలో DRO శ్రీ విశ్వేశ్వరరావు గారు, నూజివీడు సబ్-కలెక్టర్ స్మరణ్ రాజ్, ఏలూరు, జంగారెడ్డిగూడెం ల ఆర్డీఓ లు అచ్యుత్ అంభరీష్, రమణ,జిల్లా రిజిస్టరు, ఫారెస్ట్, దేవాదాయ శాఖ అధికారులు, ఏ.డి. సర్వే , తహసీల్ధారులు పాల్గొన్నారు.