స్వర్ణ ఆంధ్ర-స్వచ్ఛఆంధ్ర కార్యక్రమంలో బాగంగా కలెక్టరేట్ లో మొక్కలు నాటిన జిల్లా కలెక్టర్..
ఏలూరు,ఏప్రిల్,19: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న స్వర్ణ ఆంధ్ర – స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా శనివారం ఏలూరు కలెక్టరేట్ ఆవరణలో జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి మొక్కలు నాటారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతినెలా మూడవ శనివారం మెరుగైన పారిశుధ్యం, పర్యావరణ పరిరక్షణకోసం ప్రత్యేక లక్ష్యంతో కార్యక్రమాలను అమలు చేస్తున్నదన్నారు. ఇందులో భాగంగా ఈవారం ఈ చెక్ థీమ్ తో కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ సందర్బంగా ఏలూరు కలెక్టరేట్ లో నిర్వహించిన ఈ చెక్ కార్యక్రమంలో వివిధ శాఖల నుండి సేకరించిన ఎలక్ట్రానికి వేస్టును పరిశీలించి సంబంధిత అధికారులు, సిబ్బందికి పలు సూచనలు చేశారు. ఈ వేస్ట్ ను సరైన పద్దతిలో రీసైక్లింగ్ చేయకపోవడం వల్ల అనేక అనర్ధాలు కలుగుతాయన్నారు. కార్యాలయాల్లో, ఇళ్లల్లో, దుకాణాల్లో హృధాగా ఉన్న ఎలక్ట్రానిక్ వ్యర్ధాలను గ్రామ పంచాయితీలు, పురపాలక సంఘాల పరిధిలోని సంబంధిత అధికారులకు అందజేయాలన్నారు. పర్యావరణ పరిరక్షణకు ప్రభుత్వం చేస్తున్న కృషికి ప్రజలు సహకరించాలని కోరారు.
కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ పి. ధాత్రిరెడ్డి, డిఆర్ఓ వి. విశ్వేశ్వరరావు, కలెక్టరేట్ ఏవో నాంచారయ్య, కలెక్టరేట్ లోని వివిధ విభాగాల ఉద్యోగులు పాల్గొన్నారు.