Close

స్వర్ణాంధ్ర- స్వచ్ఛ ఆంధ్రా కార్యక్రమంలో కృష్ణా కాలువ లో వ్యర్ధాలు తొలగించే శ్రమదానంలో పాల్గొన్న జిల్లా అధికారులు..

Publish Date : 19/04/2025

ఏలూరు,ఏప్రిల్ 19: గౌ. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పిలుపు మేరకు ప్రతి మూడో శనివారం పర్యావరణ పరిరక్షణ కోసం నిర్వహించ బడుతున్న “స్వర్ణాంధ్ర స్వచ్ఛ ఆంధ్రా కార్యక్రమం” లో భాగంగా మూడవ శనివారం ఏలూరు కృష్ణా కాలువ లో గట్లపై విస్తృతంగా శ్రమదానం కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పిచ్చిమొక్కలు, చెత్త, వ్యర్థాలను తొలగించడం, పరిసరాల శుభ్రత, పర్యావరణ పరిరక్షణ చర్యలు నిర్వహించారు.

కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి, జిల్లా ఎస్పీ కె. ప్రతాప్ శివ కిషోర్ ,జాయింట్ కలెక్టర్ పి. ధాత్రిరెడ్డి స్వయంగా పాల్గొని శ్రమదానం నిర్వహించారు. వీరితోపాటు నగర పాలక సంస్థ కో-ఆప్షన్ మెంబర్ ఎస్ఎంఆర్ పెదబాబు, డిఆర్వో వి. విశ్వేశ్వరరావు, ఏలూరు ఆర్డీవో అచ్యుత అంబరీష్, నగరపాలక సంస్థ కమిషనర్ భాను ప్రతాప్, డిఎస్పీ డి. శ్రావణ్ కుమార్, ఇరిగేషన్ ఎస్ఈ నాగార్జునరావు, డిఎస్ఓ ప్రతాపరెడ్డి, పౌర సరఫరాల సంస్థ జిల్లా మేనేజరు శివరామమూర్తి, కలెక్టరేట్ ఏవో నాంచారయ్య, వన్ టౌన్ ఇన్స్పెక్టర్ సత్యనారాయణ , ఏఆర్‌ ఆర్‌ఐ పవన్ కుమార్ , రెవెన్యూ అధికారులు సిబ్బంది, పోలీస్ అధికారులు సిబ్బంది, మున్సిపల్ సిబ్బంది, స్మార్ట్ సిటీ అధికారులు సమిష్టిగా ఈ కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొన్నారు. కార్యక్రమంలో భాగంగా జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి, జిల్లా ఎస్పీ కె. ప్రతాప్ శివ కిషోర్ ,జాయింట్ కలెక్టర్ పి. ధాత్రిరెడ్డి తదితరులు కృష్ణాకాలువ గట్లపై, కాలువలోవున్న వ్యర్ధపదార్ధాలను స్వయంగా తీసి మున్సిపల్ ట్రాక్టర్ లో వేశారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి మాట్లాడుతూ ఆరోగ్యకర జీవన విధానం, పర్యావరణ పరిరక్షణలో భాగంగా ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతి నెల మూడవ శనివారం స్వర్ణ ఆంధ్ర – స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తుందని, కార్యక్రమంలో ప్రజలందరూ భాగస్వాములు కావాలన్నారు. జిల్లాస్ధాయి నుంచి మండల, గ్రామ స్ధాయివరకు నిర్వహించే ఈ కార్యక్రమం ద్వారా ప్రజల్లో కొంత అవగాహన కలుగుతుందన్నారు. ఈ విషయంలో ప్రజా భాగస్వామ్యం ఎంతో అవసరమన్నారు. ఎలక్ట్రానిక్, ప్లాస్టిక్ వ్యర్ధాలను మున్సిపాలిటీ వారికి అప్పగిస్తే వారు తదుపరి చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. పరిశుభ్రత చోటుచేసుకున్న ప్రాంతాల్లో అక్కడ ఆహ్లాదకర వాతావరణం కల్పిస్తే ఆ ప్రదేశంలో చెత్తవేసేందుకు ఎవరికీ మనస్సు రాదన్నారు. రోజువారీ అవసరాల కోసం ప్లాస్టిక్ కవర్ల స్థానంలో కాటన్ బ్యాగులు ఉపయోగించాలని కోరారు. ఒకసారి ఉపయోగించి పడేసే ప్లాస్టిక్ కవర్లను పూర్తిగా నిషేదించాలన్నారు. పరిశుభ్రత విషయంలో ప్రత్యేక శ్రద్ధ చూపించాలన్నారు. రోడ్లపై వ్యర్థాలు వేయరాదని, చెత్త కనిపిస్తే డస్ట్ బిన్ లో వేయాలని కోరారు. స్వచ్ఛ కార్యక్రమాలను పకడ్బందీగా నిర్వహించడం ద్వారా జిల్లా శుభ్రంగా ఉంటుందన్నారు. ప్రజలకు పరిశుభ్రమైన గాలి, నీరు అందించేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేస్తున్నాయని చెప్పారు.ప్రజలు, ప్రజాప్రతినిధుల భాగస్వామ్యంతో స్వచ్ఛ దివస్ కార్యక్రమాలను మరింత విస్తృతంగా చేయబడతామన్నారు. స్వచ్ఛత కోసం ప్రతి పౌరుడు కలిసి రావాలని, ప్రతి ఒక్కరూ వ్యక్తిగతంగా శుభ్రత పై ప్రత్యేక దృష్టి సాధించాలని, జిల్లాను స్వచ్ఛ ఏలూరుగా మార్చాలన్నారు. ఏలూరులో కృష్ణ కాల్వ ఐదు కిలోమీటర్ల మేర సుబ్రహ్మణ్య కార్యక్రమాన్ని నిర్వహించాలని ఇరిగేషన్ శాఖ అధికారులను ఆదేశించారు. కాలువలు చెత్త వేయకుండా నిరోధించేందుకు కృష్ణ కాలు పై ఉన్న బ్రిడ్జిల ఇరువైపులా మెస్ లు కట్టాలని సూచించారు.

ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ కె. ప్రతాప్ శివ కిషోర్ మాట్లాడుతూ స్వర్ణాంధ్ర స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమం ద్వారా పౌరుల్లో పర్యావరణ పరిరక్షణపై అవగాహన పెరుగుతోంది. పరిశుభ్రత వల్ల ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. ప్రతి ఒక్కరూ తమ సామర్థ్యం మేరకు శ్రమదానం కార్యక్రమాల్లో భాగస్వాములు కావాలి. శుభ్రతతో పాటు సమాజ సేవ లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని మరింత విస్తృతంగా తీసుకెళ్లాలి” అని పేర్కొన్నారు.

ఏలూరు నగరాభివృద్ధి సంస్థ వైస్ చైర్మన్ , జాయింట్ కలెక్టర్ పి.ధాత్రిరెడ్డి మాట్లాడుతూ ఏలూరులోని చారిత్రాత్మక కాలువలయందలి ప్లాస్టిక్ తదితర వ్యర్ధాలను తొలగించి వాటిని మళ్లీ జీవంతో నింపి, శుభ్రమైన మరియు సుందరమైన ఆహ్లాదకర ప్రదేశాలుగా మార్పుచేయడం ఈ కార్యక్రమం యొక్క ముఖ్య లక్ష్యమని ,ఈ ప్రాజెక్టును తొలుత కొన్ని ఎంపిక చేయబడిన ప్రాంతాల్లో ఫైలట్ ప్రాజెక్టుగా అమలు జరిపి, వాటి ఫలితాలను అనుసరించి ఏలూరు ఆర్బన్ డెవలప్మెంట్ అధారిటీ పరిధిలో బహుముఖముగా విస్తరించుటకు ప్రణాళిక చేస్తామని చెప్పారు. కావున స్వచ్ఛ ఏలూరు సాధన కొరకు ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం కావాలన్నారు.