ఆరబెట్టిన వరిధాన్యం కల్లాలను పరిశీలించిన జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి..
ఏలూరు/ఉంగుటూరు,ఏప్రిల్,26: రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ధాన్యం సేకరణ జరగాలని సంబంధిత అధికారులకు జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి స్పష్టమైన సూచనలు ఇచ్చారు. ఉంగుటూరు మండలం నారాయణపురంలో ఆరబెట్టిన ధాన్యం కల్లాలను ఉంగుటూరు ఎమ్మెల్యే పత్సమట్ల ధర్మరాజుతో కలిసి కలెక్టర్ వెట్రిసెల్వి పరిశీలించారు. జిల్లాలో రైతులు సంతృప్తి చెందేలా ధాన్యం సేకరణ జరిగేలా చూడాలన్నారు. గోనె సంచులు, రవాణా ఇబ్బందులు లేకుండా పటిష్టమైన చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లాలో ఇప్పటి వరకు 1,39,796 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని 11,247 మంది రైతుల నుండి కొనుగోలు చేయడం జరిగిందన్నారు. ఇప్పటి వరకు రూ. 207 కోట్ల రూపాయలను రైతుల ఖాతాలకు జమచేయడం జరిగిందన్నారు. వాతావరణ పరిస్ధితులుదృష్టిలోఉంచుకొని రైతులకు అందించేందుకు రైతు సేవాకేంద్రాల్లో టార్పాలిన్లు అందుబాటులో ఉంచాలన్నారు. ప్రస్తుతం ఉన్నవాటికి అధనంగా మరిన్ని టార్పాలిన్లు సిద్ధం చేయాలన్నారు.
జిల్లా కలెక్టర్ వెంట యంపిపి ఘంటా శ్రీలక్ష్మి, నారాయణపురం, ఉంగుటురూ సర్పంచ్ లు దిడ్ల అలకనంద, బండారు సింధూ, తహశీల్దారు పి. రఘుకుమార్, యంపిడివో ఆర్. మనోజ్ కుమార్, వ్యవసాయశాఖ ఎడి ఉషారాజకుమారి, వ్యవసాయ శాఖ అధికారులు ఎన్.ఎస్. ప్రవీణ్ కుమార్, ఎస్వీ. ఉషారాణి, ఎస్. గీత, మరియు మాలతీరాణి, సూరపు అయ్యప్ప తదితర పలువురు ప్రజా ప్రతినిధులు, తదితర వ్యవసాయశాఖ సిబ్బంది ఉన్నారు.