Close

పాక్ జాతీయుల వీసా సేవలు నిలిపివేత..

Publish Date : 25/04/2025

ఏలూరు, ఏప్రిల్,25: పాకిస్తానీ పౌరులకు భారత ప్రభుత్వం జారీచేసిన అన్ని చెల్లుబాటు అయ్యే వీసాలు 2025 ఏప్రిల్ 27 నుంచి రద్దుకానున్నాయని జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. విజయానంద్ జిల్లా కలెక్టర్లకు, ఎస్పీలకు సంబంధిత సమాచారం పంపడం జరిగిందన్నారు. ఈ నేపద్యంలో మెడికల్ వీసాలు, లాంగ్ టర్మ్ వీసాలు, దౌత్య మరియు అధికారిక వీసాలు మినహా అన్ని చెల్లుబాటు అయ్యే వీసాలు 27 ఏప్రిల్, 2025 నుంచి రద్దుకానున్నాయన్నారు. ఈ సందర్బంగా భారత ప్రభుత్వం పాకిస్తానీ పౌరులకు వీసా సేవలను తక్షణమే నిలిపివేయాలని ఆదేశించడం జరిగిందని తెలిపారు. పాకిస్తానీ పౌరులకు జారీ చేయబడిన మెడికల్ వీసా 29 ఏప్రిల్, 2025 వరకు మాత్రమే చెల్లుబాటు అవుతాయన్నారు. . పాకిస్తానీ పౌరులకు జారీ చేయబడిన ధీర్ఘకాలిక వీసాలు, దౌత్య మరియు అధికారిక వీసాలకు వర్తించదని ఉత్తర్వుల్లో పేర్కొన్నారన్నారు.