Close

నరసింహరావు పేట యు.పి.హెచ్.ఎస్ ని ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్..

Publish Date : 23/04/2025

ఏలూరు,ఏప్రిల్,23: ప్రజాఆరోగ్యంపై చేపట్టిన ఎన్ సిడి (నాన్ కమ్యూనికబుల్ డిసీజస్) సర్వేను మే 10వ తేదీ లోగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి సంబంధిత అధికారులను ఆదేశించారు.

బుధవారం నరసింహరావు పేట అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్ ని కలెక్టర్ ఆకస్మిక తనిఖీ చేశారు. ఇందులో బాగంగా హెల్త్ సర్వీసెస్ పై సమీక్షిస్తూ ఎన్.సి.డి సర్వె 3.0 గూర్చి వివరాలు అడిగి
తెలుసుకున్నారు. సర్వే పై మెడికల్ ఆఫీసర్ ని సమీక్షిస్తూ మే 10 వ తేదీ లోగా ఎన్.సి.డి సర్వే పూర్తి చేయాలని కలెక్టర్ ఆదేశించారు. సర్వే లొ ఎటువంటి లోపాలు లేకుండా ఇంటింటి కి వెళ్ళి వారికి అవసరమగు పరీక్షలను రాష్ట్ర ప్రభుత్వం మార్గదర్శకాల మేరకు పూర్తి చేయాలని ఆదేశించారు. యు.పి.హెచ్.ఎస్ పరిదిలో ఎవరైతే తక్కువ సర్వే చేసియున్నారో వారికి షోకాజు నోటీసు ఇవ్వాలని డి.ఎం.హెచ్.ఒ ని ఆదేశించారు.

కార్యక్రమంలో యు.పి.హెచ్.ఎస్.
వైద్యురాలు పి. ప్రగతి, ఎన్.సి.డి ప్రొగ్రాం ఆఫీసర్ డా.కె. నరేంద్ర కృష్ణ ,తహశీల్దారు శేషగిరి, పలువురు ఎ.ఎన్.ఎం లు, తదితరులు పాల్గొన్నారు.