Close

నూజివీడు నియోజకవర్గంలోపలు రహదారి సమస్యలను రోడ్డు భధ్రతా కమిటీ సమావేశం దృష్టికి తీసుకువచ్చిన రాష్ట్ర మంత్రి కొలుసు పార్ధసారధి..

Publish Date : 06/05/2025

ఏలూరు, మే, 6: నూజివీడు నియోజకవర్గంలోపలు రహదారి సమస్యలను రోడ్డు భధ్రతా కమిటీ సమావేశం దృష్టికి రాష్ట్ర గృహనిర్మాణ, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్ధసారధి తీసుకువచ్చారు. ఇందుకు సంబంధించిన పలు అంశాలను జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి కు అందజేశారు. ఈ సందర్బంగా రాష్ట్ర మంత్రి కె. పార్ధసారధి పలు అంశాలను పేర్కొంటూ మర్రిబంధం గ్రామంలో మెయిన్ రోడ్డు పై లైటింగ్ సరిగ్గా లేకపోవడం వల్ల గ్రామంలోనే అప్రోచ్ రోడ్ నుంచి వచ్చేటప్పుడు స్పీడ్ బ్రేకర్స్ లేకపోవడం వల్ల ఎక్కువగా రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయన్నారు. ఈ విషయంపై చర్యలు తీసుకోవాలన్నారు. మీర్జాపురం గ్రామంలో రోడ్డు ఎక్కువగా మలుపులు తిరిగి ఉన్నందున, రోడ్డు ఆక్రమణలకు గురికావడం మూలంగా ఎక్కువ రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయన్నారు. గొల్లపల్లి గ్రామం వెంబడి రోడ్లో లైటింగ్ సరిగ్గా లేనందున , వాహనాలు పెట్టుకోవడానికి సరైన పార్కింగ్ స్ధలం లేకపోవడం వల్ల కొంతమంది లారీ డ్రైవర్లు తమ వాహనాలను రోడ్ల పైన పెట్టి వేయడం వల్ల ఎక్కువ రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని వివరించారు. మొర్సపూడి గ్రామం మెయిన్ రోడ్ వెంబడి లైటింగ్ సరిగ్గా లేకపోవడం వల్ల రోడ్లు పక్కన చెట్లు తుప్పలు ఉండి రోడ్డు పైకి రావడం వల్ల ఎదురు వచ్చే వాహనాలు కనబడక ప్రమాదాలు జరుగుతున్నాయన్నారు. తుక్కులూరు గ్రామంలో మెయిన్ రోడ్డు వెంబడి లైటింగ్ సరిగ్గా లేకపోవడం వల్ల, గ్రామంలో అప్రోచ్ రోడ్లు ఎక్కువ ఉండటం వల్ల ఆ రోడ్ నుంచి వచ్చే వాహనదారులు సరైన స్పీడ్ బ్రేకర్ లేకపోవడం వల్ల వేగంగా వచ్చి మెయిన్ రోడ్ లో వచ్చే వాహనాలకు తగిలి ప్రమాదాలు జరుగుతున్నాయని వివరించారు. అన్నవరం గ్రామంలో రోడ్లు వెంబడి ఇల్లు ఉండటం వల్ల లైటింగ్ సరిగ్గా లేకపోవడం వల్ల అప్రోచ్ రోడ్లకు స్పీడ్ తీగల సరిగ్గా లేకపోవడం వల్ల మరియు సిగ్నల్ సైన్స్ పార్కింగ్ సైన్స్ సరిగ్గా రోడ్లో వెంబడి లేకపోవడం వల్ల ప్రమాదాలు జరుగుతున్నయన్నారు. నూజివీడు మండలం తుక్కులూరు, మీర్జాపురం ప్రాంతాల్లో పమాదాలు జరుగకుండా చర్యలు తీసుకోవాలన్నారు. ఆగిరిపల్లి నుండి నూజివీడు మధ్య గ్రామాల పరిధిలో ఎన్నో పాఠశాలలు ఉన్నాయని, ఆయా ప్రాంతాల్లో ప్రమాదాలు జరుగకుండా చర్యలు తీసుకోవాలన్నారు. నూజివీడు రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పోతురెడ్డిపల్లి ఆర్ అండ్ బి రోడ్డులో 11 కెవి విద్యుత్ వైర్లు విస్తరించి ఉన్నందున ఇవి ఎక్కువ ఎత్తువున్న వాహనాలకు తగిలి విద్యుత్ ప్రమాదాలు జరుగుతున్నాయని తెలిపారు. ఈ ప్రమాదాల నివారణకు అవసరమైన చర్యలు తీసుకోవాలన్నారు.