అగ్రిగోల్డ్ ఆస్తులు వేలం వేయడానికి జిల్లాస్ధాయి కమిటీ.. కమిటీని ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీచేసిన జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి..

ఏలూరు,మే,5: స్పెషల్ కోర్టు ఏలూరు వారి ఉత్తర్వులు, ప్రభుత్వ జి.వో. నెం.519, తేది 9.4.2025 మేరకు అగ్రిగోల్డ్ ఆస్తులను వేలం వేయడానికి జిల్లాస్దాయి కమిటీని ఏర్పాటు చేస్తూ జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి ఉత్తర్వులు జారీచేశారు. ఏలూరు, జంగారెడ్డిగూడెం రెవిన్యూ డివిజనల్ అధికారులు, జిల్లా రిజిస్ట్రార్ , డిపిఆర్ఓ, జిల్లా ఐటి అధికారి(డిఐవో ఎన్ఐసి), సిఐడి అధనపు ఎస్పీ, నగరపాలక సంస్ధ ఏవో, ఏలూరు స్పెషల్ కోర్ట్ అగ్రిగోల్డ్ సంస్ధ సూచించిన పేర్ల సీతారామస్వామిని ఆథరైజ్డ్ మెంబరుగా జిల్లాస్ధాయి కమిటీని నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. సిఐడి అధనపు ఎస్పీ కమిటీ మెంబర్ కన్వీనర్ గా వ్యవహరిస్తారు. ఏలూరు అర్బన్, ద్వారకాతిరుమల మండల తహశీల్దార్లు,జిల్లాస్ధాయి కమిటీకి మరియు పోలీస్, సిఐడి ధర్యాప్తు ఏజెన్సీల విచారణ సమయంలో వారికి సహకరించాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. అగ్రిగోల్డ్ ఆస్తులు ఎక్కడ ఉన్నాయో పరిశీలించడం, సంబంధిత సబ్ రిజిస్ట్రార్ ల నుండి భూముల విలువ సేకరించడం, అధీకృత సంస్ధల నుండి సరసమైన మార్కెట్ ధర సేకరించడం, అగ్రిగోల్డ్ భూములు రెవిన్యూ రికార్డుల్లో మ్యూటేషన్ చేయడం, జిల్లాస్ధాయి కమిటీ విధులుగా ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.