Close

వాతావరణ శాఖ ఏలూరు జిల్లాలో భారీ వర్షాలు, ఈదురు గాలుల హెచ్చరిక జారీ చేసిన నేపథ్యంలో జిల్లా యంత్రాంగాన్ని జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి అప్రమత్తం చేశారు.

Publish Date : 04/05/2025

ఏలూరు, మే, 4 : వాతావరణ శాఖ ఏలూరు జిల్లాలో భారీ వర్షాలు, ఈదురు గాలుల హెచ్చరిక జారీ చేసిన నేపథ్యంలో జిల్లా యంత్రాంగాన్ని జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి అప్రమత్తం చేశారు. భారీవర్షాలు ప్రారంభం కాగానే కలెక్టరేట్ కు చేరుకొని కలెక్టరేట్ లోని కమాండ్ కంట్రోల్ సెంటర్ లో వివిధ న్యూస్ చానెల్స్ ప్రసారం అయ్యే ఏలూరు జిల్లాలో భారీ వర్షాల కారణంగా చెట్లు, విద్యుత్ స్తంబాలు కూలడం వంటి అంశాలను పరిశీలించి వెంటనే తక్షణ చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు సెల్ ఫోన్ ద్వారా ఆదేశాలు జారీ చేశారు. ఏలూరు నగరం, భీమడోలు మండలం గుండుగొలను, ద్వారకాతిరుమల, జంగారెడ్డిగూడెం, చింతలపూడి, నూజివీడు, తదితర ప్రాంతాలలో చెట్లు కూలి ట్రాఫిక్ నకు ఆటంకంగా ఉందని, విద్యుత్ స్తంబాలు పడిపోవడంతో విద్యుత్ సరఫరాకు ఆటంకం కలిగిందని వచ్చిన అంశాలపై కలెక్టర్ వెంటనే స్పందించారు. సంబంధిత శాఖల అధికారులకు వెంటనే సెల్ ఫోన్ ద్వారా ఫోన్ చేసి జెసిబి ల సహాయంతో చెట్లు తొలగించి ట్రాఫిక్ నకు ఎటువంటి ఆటంకం కలగకుండా చూడాలని, విద్యుత్ స్తంభాలకు పునరుద్ధరించి విద్యుత్ సరఫరా జరిగేలా చూడాలని అధికారులను ఆదేశించారు. అధికారులు కూడా మీడియా గ్రూప్ లలో వచ్చే అంశాలను పరిగణనలోనికి తీసుకుని, తక్షణమే స్పందించి, క్షేత్రస్థాయి అధికారులతో సమన్వయము చేసుకుని చర్యలు తీసుకోవాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు.