జూన్, 2వ తేదీ సోమవారం జిల్లా కలెక్టర్ వారు చింతలపూడి లో నిర్వహించే పిజిఅర్ఎస్ కార్యక్రమంలో పాల్గొంటారు
ఏలూరు, మే, 31 : ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించి వాటిని పరిష్కరించే ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ (PGRS) నిర్వహణలో భాగంగా జూన్, 2వ తేదీ సోమవారం చింతలపూడి లో పిజిఅర్ఎస్ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ కె.వెట్రిసెల్వి తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా స్థాయి అధికారులు అందరూ తప్పని సరిగా హాజరు కావాలన్నారు. ఈ విషయంలో ఎటువంటి మినహాయింపు లేదని కలెక్టర్ స్పష్టం చేశారు.
అదేవిధంగా జిల్లా రెవెన్యూ అధికారి వారు , వివిధ శాఖలకు చెందిన రెండవ స్థాయి అధికారులు ప్రజల నుంచి ఫిర్యాదులను యధావిధిగా ఏలూరు కలెక్టరేట్ గోదావరి సమావేశ మందిరంలో స్వీకరించడం జరుగుతుందన్నారు.
“ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ (PGRS)” అర్జీల స్వీకరణ కార్యక్రమాన్ని జిల్లా కేంద్రంతో పాటు యధావిధిగా మండల,డివిజనల్, మున్సిపల్ స్థాయిలో కూడా నిర్వహిస్తారు.అర్జీదారులు ఈ విషయాన్ని గమనించి తమ ఫిర్యాదులను సమీపంలోని మండల కార్యాలయాలు,డివిజనల్ కార్యాలయాలు లేదా మున్సిపల్ కార్యాలయాలలో కూడా సమర్పించుకోవచ్చునన్నారు.