ప్రభుత్వంలో అన్ని శాఖల కన్నా ప్రజలకు ఎక్కువగా సేవలందించే చేసే శాఖ రెవిన్యూ శాఖ అని అటువంటి శాఖలో పనిచేస్తున్నందుకు సిబ్బంది గర్వంగా ఫీల్ అవ్వాలని జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి చెప్పారు.

ఏలూరు, జూన్, 20 : ప్రభుత్వంలో అన్ని శాఖల కన్నా ప్రజలకు ఎక్కువగా సేవలందించే చేసే శాఖ రెవిన్యూ శాఖ అని అటువంటి శాఖలో పనిచేస్తున్నందుకు సిబ్బంది గర్వంగా ఫీల్ అవ్వాలని జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి చెప్పారు. స్థానిక కలెక్టరేట్లోని గోదావరి సమావేశపు హాలులో శుక్రవారం ‘రెవిన్యూ డే’ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన కార్యక్రమంలో ముఖ్యఅతిధిగా పాల్గొన్న కలెక్టర్ వెట్రిసెల్వి మాట్లాడుతూ సమాజంలో ఏ సమస్యలు ఎదురైనా పరిష్కరించడం, వరదలు వంటి విపత్తు సమయంలో ఎటువంటి ప్రాణ, ఆస్థి నష్టం కలగకుండా ప్రజలకు రెవిన్యూ శాఖ సేవలందిస్తుందన్నారు. రెవిన్యూ శాఖ అధికారులు తాము పనిచేసే పరిధిలో ప్రజలకు ఉత్తమ సేవలందిస్తే ప్రజలు వారిని ఎప్పటికీ గుర్తుంచుకుంటారన్నారు.
జాయింట్ కలెక్టర్ పి . ధాత్రిరెడ్డి మాట్లాడుతూ రెవిన్యూ శాఖాధికారులు ప్రజలకు ఉత్తమసేవలందించి రోల్ మోడల్ గా నిలవాలన్నారు. ప్రభుత్వం జారీ చేసే ఉత్తరువులు, నిబంధనలపై ఎప్పటికప్పుడు అవగాహన పెంచుకుంటూ తమ పనితీరును మెరుగుపరచుకోవాలన్నారు. ప్రజలకు ఎక్కువగా సేవలందించేందుకు అవకాశం ఉన్న శాఖ రెవిన్యూ శాఖ అని, రెవిన్యూ సిబ్బంది ప్రజలకు మరింత మెరుగైన సేవలందించేలా పనిచేయాలన్నారు.
ఈ సందర్భంగా కలెక్టరేట్లో నిర్వహించిన రంగోలి పోటీలను, గోదావరి సమావేశపు హాలు ఆవరణలో రెవెన్యూ చట్టాలు పుస్తక ప్రదర్శనను కలెక్టర్ పరిశీలించారు. డిఆర్ఓ వి. విశ్వేశ్వరరావు, ఆర్డీఓ అచ్యుత్ అంబరీష్, సర్వే అసిస్టెంట్ డైరెక్టర్ అన్సారీ, కలెక్టరేట్ పరిపాలనాధికారి నాంచారయ్య, సూపెరింటెండెంట్లు చల్లన్న దొర , ప్రభృతులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా రెవిన్యూ శాఖలో ఉత్తమసేవలందించి పదవీ విరమణచేసిన జగన్మోహనరావు, బన్నీ, పోతురాజు, రాజశేఖర్, రాజశేఖర్ రాయుడు, చంద్రశేఖర్, ప్రభృతులను దుశ్శాలువాతో కలెక్టర్ సన్మానించారు.
రెవిన్యూ డే సందర్భంగా నిర్వహించిన వివిధ పోటీలలో గెలుపొందిన విజేతలకు బహుతులను జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి అందజేశారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్విని, జేసీ పి. ధాత్రిరెడ్డి ని సిబ్బంది సన్మానించారు.