సామాజిక మౌలిక సదుపాయాల కల్పనకు పశుసంవర్ధక శాఖ రూ. 80 వేల విరాళం.

ఏలూరు, జూలై, 03: సామాజిక మౌలిక సదుపాయాలు కల్పించేందుకు ముందుకు వచ్చిన పశుసంవర్ధక శాఖ అధికారులు, సిబ్బందిని జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి ప్రత్యేకంగా అభినందించారు. గురువారం స్ధానిక కలెక్టరేట్ లో కలెక్టర్స్ వైటల్ సామాజిక మౌలిక సదుపాయాల అభివృద్ధి నిధికి పశు సంవర్ధక శాఖ ద్వారా విరాళంగా రూ. 80 వేల చెక్కును ఆశాఖ జాయింట్ డైరెక్టర్ పి. గోవిందరాజులు జిల్లా కలెక్టర్ వారికి అందజేశారు. స్వచ్ఛంధంగా ముందుకు వచ్చి సామాజిక కార్యక్రమాల్లో పాలుపంచుకోవడం అభినందనీయమన్నారు.
పి4 కార్యక్రమాన్ని అందిపుచ్చుకుని హాస్టళ్లు, భవిత కేంద్రాలు, క్రీడా సౌకర్యాలు తదితర కీలకమైన సామాజిక మౌలిక సదుపాయాల కార్యక్రమాలకు గణనీయమైన నిధులను సమీకరించాలనే దృఢ సంకల్పంతో జిల్లా కలెక్టర్ మరియు మేజిస్ట్రేట్ వారి సూచనలతో సమిష్టి బాధ్యత మరియు స్ఫూర్తితో, పశు సంవర్ధక శాఖ సిబ్బంది స్వచ్ఛందంగా ఈ గొప్ప కార్యక్రమానికి (Collector’s vital social infrastructure development fund) కు రూ.80 వేలను చెక్ రూపంలో పశు సంవర్ధక శాఖ సంయుక్త సంచాలకులు గౌరవ జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి కి అందజేశారు.