• Social Media Links
  • Site Map
  • Accessibility Links
  • English
Close

ఈ పార్కులో జాయింట్ కలెక్టర్ ధాత్రి రెడ్డి వారు వినూత్నముగా ఏర్పాటు చేయబడిన టేక్ బుక్ రీడ్ బుక్ అని స్టాల్ ను ప్రత్యేకంగా ఏర్పాటు చేయబడిన స్టాల్ ను ప్రతి ఒక్కరూ చూసి జెసినీ అభినందించారు

Publish Date : 13/07/2025

ఏలూరు,జూలై 13:ఏలూరు పోలీస్ ప్రధాన కార్యాలయం వద్ద గల పార్క్ లో అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ వారి ద్వారా నూతనముగా నిర్మించిన చిల్డ్రన్ ట్రాఫిక్ పార్క్ ను ప్రారంభోత్సవం చేసిన ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ ఎమ్మెల్యే బడేటి రాధాకృష్ణయ్య (చంటి) , జిల్లా ఎస్పీ కె. ప్రతాప్ శివ కిషోర్ , జాయింట్ కలెక్టర్ పి .ధాత్రి రెడ్డి , అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ పెద్దబోయిన శివప్రసాద్ ..

ఏలూరు పట్టణంలోని చిన్నారుల కోసం ప్రత్యేకంగా రూపొందించిన ట్రాఫిక్ పార్క్ ను ఆదివారం ఘనంగా ప్రారంభించారు.

ఈ కార్యక్రమంలో ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ ,ఎమ్మెల్యే బడేటి రాధాకృష్ణయ్య (చంటి) , జిల్లా ఎస్పీ కె. ప్రతాప్ శివ కిషోర్ , జాయింట్ కలెక్టర్ పి.ధాత్రి రెడ్డి ముఖ్య అతిథులుగా పాల్గొని ప్రారంభోత్సవాన్ని నిర్వహించారు.

ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ కె. ప్రతాప్ శివ కిషోర్ మాట్లాడుతూ పిల్లలకు ట్రాఫిక్ పరంగా అవగాహన కల్పించేందుకు ట్రాఫిక్ పోలీస్ విభాగం ప్రత్యేకంగా సిద్ధం చేసిన ఈ పార్క్, ఒక శిక్షణా కేంద్రంగా మారుతుంది. ఇటు వంటి పార్కులు పిల్లలు ట్రాఫిక్ నియమ, నిబంధనలను గురించి తెలుసుకుని వారి తల్లిదండ్రులకు అవగాహన కనిపిస్తారని, హెల్మెట్ ధరించడం వలన ఏదైనా ప్రమాదం జరిగినా ప్రాణాపాయం నుండి 99% కాపాడుతుందని, రోడ్డు ప్రమాదాలు అనేవి ఏ విధంగా జరుగుతాయి, వర్షాలు పడినప్పుడు రోడ్లు యొక్క స్థితిగతులను గురించి గానీ ఏదైనా గోతులు వలన గాని ప్రమాదాలు జరగకుండా ఉండేలాగా ఈ పార్కు నిర్మాణం జరిగినట్టు, ఈ పార్కు నిర్మాణం కొరకు జాయింట్ కలెక్టర్ , ఎంపీ గారు, ఎమ్మెల్యే గారు కృషి ఫలితముగా పార్కు నిర్మాణం జరిగినట్లు ఈ పార్కు నిర్మాణంలో కాంట్రాక్టర్ చంద్రశేఖర్ గారు ఎంతో నిబద్ధత తోటి సొంత ఇంటి నిర్మాణం లాగా ప్రతి క్షణం దగ్గర ఉండి పారదర్శకంగా పర్యవేక్షణ చేస్తూ ఈ పార్కును నిర్మించినట్లు వారిని అభినందించినారు.

ఎంపీ పుట్టా మహేష్ కుమార్ మాట్లాడుతూ క్రాస్ రోడ్ ట్రాఫిక్ పార్క్ నిర్మాణమునకు ముఖ్యకారకులు ఏలూరు జిల్లా జాయింట్ కలెక్టర్ పి.దాత్రి రెడ్డి , ఏలూరు జిల్లా ఎస్పీ కె ప్రతాప్ శివ కిషోర్ , ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి గారి యొక్క సహకారంతో రూ.84 లక్షల వ్యయంతో పార్కు నిర్మాణం చేసినట్లు, ఇప్పటికే ఏలూరు జిల్లా వ్యాప్తంగా రోడ్డు ప్రమాదాల నివారణ కొరకు జిల్లా ఎస్పీ గారు ఎన్నో వినూత్న కార్యక్రమాల ద్వారా ప్రజలకు రోడ్డు ప్రమాదాలు వలన జరిగే అనర్ధాలను గురించి వివరించడం జరిగిందన్నారు, ప్రజలకు సేవ చేసే విషయాలలో రాజకీయ నాయకులే కాకుండా జిల్లా అధికారులు కూడా పోటీపడి ప్రజలకు మెరుగైనటువంటి సేవలను అందించడం మన జిల్లా చేసుకున్నటు వంటి అదృష్టమని, ఇండియాలోనే ప్రప్రదమముగా క్రాస్ రోడ్ ట్రాఫిక్ పార్క్ ను నిర్మించడం ఇదే ప్రథమం అని ఎటువంటి పార్కులు మరిన్ని అవసరమన్నారు. చిన్నప్పటి నుంచే పిల్లలకు ట్రాఫిక్ నిబంధనలు, రోడ్ సేఫ్టీపై అవగాహన కల్పించడం సమాజ భద్రతకు పెట్టుబడిలా ఉంటుందన్నారు. ఈ పార్క్ ద్వారా వారు ఆటలోనే నేర్చుకునే విధంగా తీర్చిదిద్దడం జిల్లా జాయింట్ కలెక్టర్ ,జిల్లా ఎస్పీ లను ఆయన అభినందించినారు.

ఏలూరు ఎమ్మెల్యే బడేటి రాధాకృష్ణయ్య (చంటి )మాట్లాడుతూ రోడ్లపై భద్రతకు ప్రతి ఒక్కరికి బాధ్యత ఉంటుందన్నారు. క్రాస్ రోడ్ ట్రాఫిక్ పార్క్ ద్వారా పిల్లలు చిన్న వయసు లోనే ట్రాఫిక్ చట్టాలు, బాధ్యతలు అర్థం చేసుకుంటారన్నారు. ఇది భవిష్యత్‌లో మెరుగైన పౌరులుగా ఎదిగేందుకు దోహదపడుతుందన్నారు.

జాయింట్ కలెక్టర్ పి.ధాత్రి రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం పౌర భద్రత, పిల్లల భవిష్యత్తు పరి రక్షణపై ఎంతో ప్రాధాన్యత ఇస్తోందన్నారు. ఈ ట్రాఫిక్ పార్క్, విద్యా మరియు ఎన్ ఎన్ భద్రత రంగాల్లో సమ న్వయానికి చక్కటి ఉదాహరణ అని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో ఏలూరు అర్బన్ డెవలప్మెంట్ చైర్మన్ పెద్ది పోయిన శివప్రసాద్ , ఏలూరు చైర్ పర్సన్ నూర్జహాన్ పెదబాబు , కో ఆప్షన్ మెంబర్ యస్ యం ఆర్ పెదబాబు , ఎస్సీ కార్పొరేషన్ డైరెక్టర్ దాసరి ఆంజనేయులు , మాజీ ఎమ్మెల్యే ఘంట మురళి , ఏలూరు డి.ఎస్.పి శిరిడి శ్రావణ్ కుమార్, ఏలూరు త్రీ టౌన్ ఇన్స్పెక్టర్ కోటేశ్వరరావు , ఏలూరు ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ ఎస్.లక్ష్మణ్ రావు , ఏ ఆర్ డీఎస్పీ చంద్ర శేఖర్ పలువురు ప్రజా ప్రతినిధులు, పోలీసు అధికారులు, చిన్నారులు, తల్లి దండ్రులు పాల్గొన్నారు. ట్రాఫిక్ పార్క్ లో ట్రాఫిక్ సిగ్నల్స్, జేబ్రా క్రాసింగ్, ట్రాఫిక్ రూల్స్ పాఠాలు, మినీ రోడ్ మోడల్స్ ఏర్పాటు చేయడం జరిగింది.