Close

4,358 కొత్త స్పౌజ్ పెన్షన్లు పంపిణీ. జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి.

Publish Date : 30/07/2025

ఏలూరు, జూలై, 30: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఎన్.టి.ఆర్. భరోసా పింఛన్ల ను ఆగస్ట్ నెలలో 2,61,592 మంది ఫించన్ దారులకు రూ.114.25 కోట్ల రూపాయిలు పంపిణీ చేయడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి తెలిపారు. ఆగస్టు నెల పింఛను చెల్లింపులపై బుధవారం సంబంధిత అధికారులకు కలెక్టర్ దిశానిర్దేశం చేశారు.ఆగస్టు నెల పింఛను చెల్లింపులు శుక్రవారం ఉదయం 7.00 గంటలకు ప్రారంభం అవుతుందన్నారు. అనివార్య కారణం ల చేత ఆగస్టు 1 వ తేదీన తీసుకోని వారికి ఆగస్టు 2 వ తేదీ న పంపిణీ చేస్తారన్నారు. జిల్లా లో 5,303 మంధి సచివాలయ , ఇతర ప్రభుత్వ సిబ్బంది తో పెన్షన్ల పంపిణీకి అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. పింఛను పొందేందుకు పింఛను దారులు సచివాలయ సిబ్బంది ద్వారా వారి సంబంధిత ఇళ్లలో అందుబాటులో ఉండేలా ముందస్తు సమాచారం అందించాలన్నారు.

4,358 కొత్త స్పౌజ్ పెన్షన్లు పంపిణీ..
జిల్లాలో ఆగస్టు నెలలో స్పౌజ్ కేటగిరి (వితంతు పించనులు) కొత్తగా 4,358 పెన్షన్లు ప్రభుత్వం మంజూరు చేసిందన్నారు. వాటిని ఆగస్టు నెలలో పించనుదారులకు పంపిణి చేయడం జరుగుతుందన్నారు. ఆగిరిపల్లి మండలంలో 200 మంది, భీమడోలు 152, బుట్టాయిగూడెం 107, చాట్రాయి 170, చింతలపూడి 160, చింతలపూడి అర్బన్ 39, దెందులూరు 151, ద్వారకాతిరుమల 161, ఏలూరు 87, ఏలూరు అర్బన్ 404, జంగారెడ్డిగూడెం 133, జంగారెడ్డిగూడెం అర్బన్ 80, జీలుగుమిల్లి 55, కైకలూరు 161, కలిదిండి 154, కామవరపుకోట 130, కొయ్యలగూడెం 180, కుక్కునూరు 86, లింగపాలెం 132, మండవల్లి 118, ముదినేపల్లి 148, ముసునూరు 136, నిడమర్రు 97, నూజివీడు 200, నూజివీడు అర్బన్ 88, పెదపాడు 147, పెదవేగి 194, పోలవరం 124, టి. నర్సాపురం 104, ఉంగుటూరు 189, వేలేరుపాడు మండలంలో 71, మందికి కొత్తగా స్పౌజ్ కేటగిరిలో పెన్షన్లు అందించబడతాయన్నారు.