Close

పోలవరం ప్రాజెక్టు ఆర్ అండ్ ఆర్ పనుల భూ సేకరణ పనులు వెంటనే పూర్తి చేయాలి ఆయా గ్రామాలలో గ్రామ సభలు నిర్వహించాలి-జిల్లా కలెక్టరు కె.వెట్రిసెల్వి

Publish Date : 29/07/2025

ఏలూరు,జూలై 29: జిల్లా కలెక్టరేటు గౌతమి సమావేశ మందిరంలో మంగళవారం పోలవరం ప్రాజెక్టు ఆర్ అండ్ ఆర్ పనులకు సంబంధించి భూ సేకరణపై జిల్లా జాయింటు కలెక్టరు పి.ధాత్రిరెడ్డి, అల్లూరి సీతారామరాజు జిల్లా చింతూరు ఐటిడిఏ అపూర్వ భరత్, జిల్లా రెవిన్యూ అధికారి వి.విశ్వేశ్వర రావు, సంబంధిత అధికారులతో జిల్లా కలెక్టరు కె.వెట్రిసెల్వి సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టరు కె.వెట్రిసెల్వి మాట్లాడుతూ పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించి తమ భూములు అందించిన నిర్వాసితులకు ఆర్ అండ్ ఆర్ ప్యాకేజి లో భాగంగా భూమికి భూమి, ఆర్ అండ్ ఆర్ కాలనీల నిర్మాణం, తదితర పనులకు గాను ఏలూరు జిల్లాలో ఇంకా 5 వేలు ఎకరాలు భూమి అవసరం కాగా ఇప్పటికే బుట్టాయిగూడెం, జీలుగుమిల్లి మండలాలు 800 ఎకరాలను గుర్తించడం జరిగిందని అన్నారు. మిగతా 4,200 ఎకరాలు వారానికి 500 ఎకరాలు చొప్పున ఆగస్టు15 వ తేదీ నాటికి పూర్తి చెయ్యాలని ఆదేశించారు.ఈ భూములు పూర్తిగా గిరిజనేతర భూములు మాత్రమే గుర్తించాలని, గిరిజనులు, ఇతరులు గాని ఏటువంటి ఆక్రమణలు ఉండకూడదని స్పష్టం చేశారు.భూసేకరణ కోసం భూమిని గుర్తించిన తర్వాత ఆయా గ్రామాలలో గ్రామసభలు నిర్వహించాలని జిల్లా కలెక్టరు అధికారులను ఆదేశించారు. భూములు గుర్తించిన తర్వాత ఆయా రైతులతో ఆర్డీవో, డిఎస్పి అధికారులు చర్చించి వారి సమక్షంలో గ్రామ సభలు నిర్వహించాలని సూచించారు. భూములకు పరిహారాన్ని ప్రభుత్వ నిబంధనలు ప్రకారం రైతులకు చెల్లించటానికి అన్ని చర్యలు తీసుకోవాలన్నారు. భూ సేకరణ స్నేహపూరిత వాతావరణంలో రైతులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చేలా అధికార యంత్రాంగం వ్యవహరించాలని జిల్లా కలెక్టరు కె.వెట్రిసెల్వి సూచించారు.

ఈ సమావేశంలో స్పెషల్ కలెక్టరు యస్.సరళ వందనం,స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు,తహాశీల్దార్లు, డిప్యూటీ తహాశీల్దార్లు,తదితరులు పాల్గొన్నారు.