Close

ఉపాధి హామీ పని లబ్ధిదారులకు ముఖ ప్రామాణికరణ ద్వారా పోస్ట్ ఆఫీసు సేవలు

Publish Date : 19/08/2025

ఏలూరు, ఆగష్టు, 19 : ఉపాధి హామీ పని లబ్ధిదారులు పోస్ట్ ఆఫీసు వద్ద ఇండియా పోస్ట్ పేమెంట్స్ అకౌంటు ఓపెన్ చేసుకుని వేలిముద్ర లేదా ముఖ ప్రామాణికరణ ద్వారా నగదు ఉపసంహారణ చేసుకోవచ్చు అని ఏలూరు కలెక్టర్ కె వెట్రిసెల్వి తెలిపారు మరియు పోస్ట్ ఆఫీసు ముఖ ప్రామాణికరణ పోస్టర్ ను మంగళవారం జిల్లా కలెక్టరేట్లో కలెక్టర్ విడుదల చేయడం జరిగింది ఈ సందర్భంగా కాలేటర్ వెట్రిసెల్వి మాట్లాడుతూ NREGS వర్కర్స్ అందరూ పోస్ట్ ఆఫీసు IPPB అకౌంటు ప్రారంభించి, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందించే సేవలు పొందాలన్నారు. .

ఏలూరు డివిజన్ పోస్ట్ ఆఫీస్ సూపరింటెండెంట్ ఎస్. శ్రీకర్ బాబు మాట్లాడుతూ ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంకు లో అకౌంట్ ప్రతీ ఒక్కరూ ప్రారంభించాలని, పోస్టు ఆఫీసు డోర్ స్టెప్ సర్వీసెస్ కొరకు 155299 లేదా 033-2202900 నెంబర్లకు కాల్ చేయవచ్చన్నారు.
ఈ కార్యక్రమంలో లో , ASP డి. శ్రీనివాస్ , IPPB మేనేజర్ కె. రాజేష్ పాల్గొన్నారు.