• Social Media Links
  • Site Map
  • Accessibility Links
  • English
Close

పిజిఆర్ యస్ లో అందిన అర్జీలు పరిష్కారంపై అధికారులు ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాలి. పిజిఆర్ యస్ లో వచ్చిన అర్జీలు 441. జిల్లా కలెక్టరు కె.వెట్రిసెల్వి ..

Publish Date : 25/08/2025

ఏలూరు,ఆగస్టు 25:జిల్లా కలెక్టరేటు గోదావరి సమావేశ మందిరంలో సోమవారం జిల్లా స్థాయి ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని జిల్లాస్థాయి అధికారులతో నిర్వహించారు.ఈ సందర్బంగా జిల్లా కలెక్టరరు కె.వెట్రిసెల్వితో పాటు జిల్లా జాయింటు కలెక్టరు పి.ధాత్రిరెడ్డి, జిల్లా రెవెన్యూ అధికారి వి.విశ్వేశ్వర రావు, ఆర్డీవో యం.అచ్యుత అంబరీష్,యస్ డిసి కె.భాస్కర్, జెడ్పీ సిఈవో యం.శ్రీహరి, డిఆర్డీఏ పిడి ఆర్.విజయరాజు, ఎస్సీ కార్పొరేషన్ ఈడి యం.ముక్కంటి, సర్వే సహాయ సంచాలకులు అన్సారీ, నగరపాలక కార్పొరేషన్ కమీషనరు ఏ.భాను ప్రతాప్ లు అర్జీలు స్వీకరించారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టరు కె.వెట్రిసెల్వి మాట్లాడుతూ ప్రజా ఫిర్యాదుల పరిష్కారంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఫిర్యాదులు పరిష్కారంలో నిర్లక్ష్యం వహించే అధికారులపై చర్యలు తప్పవని,క్షేత్రస్థాయిలో ఫిర్యాదుదారులతో స్వయంగా మాట్లాడి నాణ్యమైన పరిష్కారాన్ని చూపాలన్నారు.శాఖలు వారీగా వచ్చిన అర్జీలను పరిశీలించి తక్షణమే పరిష్కార చర్యలు చేపట్టాలన్నారు. అర్జీలు పరిష్కారంలో బాధ్యతాయుతంగా వ్యవహరించాలని, నిర్లక్ష్యానికి తావు లేకుండా అధికారులు సమిష్టిగా పనిచేయాలని సూచించారు.పిజిఆర్ యస్ కార్యక్రమాన్ని అత్యంత పారదర్శకంగా నిర్వహించి క్షేత్రస్థాయిలో ఉత్పన్నమయ్యే సమస్యలను క్షేత్రస్థాయిలోనే చక్కని పరిష్కార మార్గాలు చూపించి అర్జీలు రీ-ఓపెన్‌కు ఆస్కారం లేకుండా చూడాలన్నారు.

ఈ రోజు వచ్చిన అర్జీలలో కొన్ని.

ఏలూరు మండపం పత్తేబాదు వృద్ధాశ్రమం నివాసి గంధం అంజయ్య నేను అనాధను వృద్ధాశ్రమంలో కాలం గడుపు తున్నాను.నా కాలుకు దెబ్బ తగిలింది ప్రభుత్వాసుపత్రిలో ఆపరేషన్ చేయించుకునుటకు నాకు సహాయ,సహకారాలు అందించాలని కోరారు, మండవల్లి మండలం అల్లినగరం చెందిన జుజ్జవరపు పాల్ గ్రామ పంచాయతీ పారిశుద్ధ్య కార్మికునిగా పనిచేస్తున్నాను.కొన్ని నెలలుగా జీతం రావడం లేదని పరిష్కారం చూపాలని అర్జీని ఇచ్చారు, చింతలపూడి మండలం ఎర్రగుంటపల్లి చెందిన కొల్లి నర్సారెడ్డి మా 9వ వార్డులో డ్రైన్లు లేక చాలా ఇబ్బందులు పడుతున్నామని నిర్మాణం చేసేలా చర్యలు తీసుకోవాలని విన్నవించు కున్నారు, కైకలూరు మండలం ఆటపాక చెందిన తోట శ్రీనివాస నాయుడు మా రహదారికి అడ్డంగా కరెంటు స్తంభాలు ఉన్నాయని తొలగించాలని విద్యుత్తు శాఖ అధికారులను కోరగా డబ్బులు చెల్లించాలని అన్నారని, మేము నిరుపేదలము మీరే మాకు న్యాయం చేయాలని వేడుకున్నారు, కలిదిండి మండలం మూలలంకకు చెందిన యస్.యన్.వి. సత్యనారాయణ మాగ్రామం లో విద్యత్తు వైర్లు క్రిందకి వేలాడుతున్నాయని పూర్వం వేసిన విద్యత్తు స్తంభాలు కురసగా అయ్యాయని ఈ సమస్యకు పరిష్కారం చూపాలని అర్జీని ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో వివిధ శాఖల జిల్లా అధికారులు,జిల్లా కలెక్టరేటు సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.