చిన్నారులు,విద్యార్ధులు ఎలాంటి వేధింపులు ఎదురైనా, తక్షణమే ధైర్యంగా పెద్దలకు తెలియజేసి సహాయం పొందాలి.. జిల్లా కలెక్టర్ కె.వెట్రిసెల్వి

ఏలూరు,ఆగస్టు 30:కిశోరి వికాసం 2.O కార్యక్రమంలో భాగంగా గౌరవ జిల్లా కలెక్టర్ వారి ఆదేశాల మేరకు మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్యర్యంలో పాఠశాలలు కళాశాలలో విద్యార్ధులకు విస్తృత స్థాయిలో అవగాహనా కార్యక్రమాలు నిర్వహించబడుచున్నాయి, ప్రతి శనివారం (No Bag Day) ప్రత్యేక అంశాలపై యువ, సఖి గ్రూపులకు మహిళాభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ ద్వారా అవగాహన కార్యక్రమాలు చేపట్టటం జరుగుతున్నది. ఈ కార్యక్రమాలలో భాగంగా స్థానిక శనివారపుపేట జడ్పీ హై స్కూల్ లో జరిగిన కిశోరి వికాశం 2.O కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ కె.వెట్రిసెల్వి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ చిన్నారులు,
విద్యార్ధులు ఎలాంటి వేధింపులు ఎదురైనా, తక్షణమే ధైర్యంగా పెద్దలకు తెలియజేసి సహాయం పొందాలన్నారు. పోక్సో యాక్ట్ యొక్క ప్రాముఖ్యత మరియు పిల్లలలకు లభించే చట్టపరమైన రక్షణ, అలాగే గుడ్ టచ్, బ్యాడ్ టచ్ గుర్తించే విధానం గురించి వివరించారు.చిన్నారులు, విద్యార్ధులు ఎలాంటి వేధింపులు ఎదురైనా, తక్షణమే ధైర్యంగా, పెద్దలకు తెలియచెయ్యాలని, సహాయం పొందాలని విద్యార్ధులకు యువ మరియు సఖి గ్రూప్స్) అర్ధం అయ్యే విధంగా విసృతమైన అవగాహన కల్పించారు.
ఒకవేళ ఎప్పుడైనా అనుకోకుండా ఆపద వస్తే, ఆపద నుండి ఎలా బయటపడాలో అవగాహన కల్పిస్తూ హెల్ప్ లైన్ నెంబర్లు అయిన చైల్డ్ హెల్ప్ లైన్ (1098), విమెన్ హెల్ప్ లైన్ (181) మరియు ఎమర్జన్సీ హెల్ప్ లైన్ 112,1972 నెంబర్లపై అవగాహన కల్పించారు. విద్యార్ధులు చిన్న వయస్సులో స్వీయరక్షణ చైతన్యం పెంపొందించుకోవటం అవసరం అని అన్నారు, ఈ కార్యక్రమంలో విద్యార్థులు చురుకుగా స్పందించి కలెక్టర్ వారు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పారు. మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారులు, ఇలాంటి కార్యక్రమాలు పిల్లలలో చైతన్యం పెంపొందించడానికి, భద్రతా వాతావరణం ఏర్పరచడానికి ఎంతో ఉపయోగకరమని పేర్కొన్నారు.
కార్యక్రమంలో ఐ.సి.డి.యస్. పిడి పి.శారద, నోడల్ ఆఫీసర్ ఇ. తులసి, ఏలూరు సి.డి.పి.ఓ. ఎ. పద్మావతి, డి.సి.పి.ఓ., సి.హెచ్. సూర్య చక్రవేణి, పాఠశాల ప్రధానోపాధ్యాయులు, పోలీసు, విద్యాశాఖ సిబ్బంది మరియు తదితరులు పాల్గొన్నారు.