మధ్యాహ్న భోజనం పరిశీలించిన జిల్లా కలెక్టర్ కె .వెట్రిసెల్వి విద్యార్థులతో కలిసి భోజనం చేసిన జిల్లా కలెక్టర్
Publish Date : 30/08/2025

ఏలూరు,ఆగస్టు,30: డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకాన్ని స్థానిక శనివారపుపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జిల్లా కలెక్టర్ కె. వెట్రి సెల్వి శనివారం పరిశీలించారు. విద్యార్థులతో కలిసి ఆహారాన్ని స్వీకరించారు. విద్యార్థులతో మాట్లాడుతూ ఆహార నాణ్యతను అడిగి తెలుసుకున్నారు. ఆహారాన్ని తీసుకునే ముందు చేతులను సబ్బుతో పరిశుభ్రంగా కడగాలని సూచించారు.విద్యార్థులు క్రమశిక్షణతో ఉండాలని సూచించారు. ఉపాధ్యాయులు చెప్పిన అంశాలను గ్రహించాలని అందుకు ఏకాగ్రత అవసరం అన్నారు. పాఠ్యాంశాల్లో సందేహాలు ఉంటే వెంటనే నివృత్తి చేసుకోవాలి అన్నారు.భవిష్యత్తులో ఏం కావాలనుకుంటున్నారని కలెక్టర్ విద్యార్థులను ప్రశ్నించారు. ఇప్పటినుంచే ప్రణాళిక బద్ధంగా చదివి కలను నెరవేర్చు
కోవాలన్నారు.
వీరి వెంట ఐసిడిఎస్ పిడి పి.శారద ఏలూరు తాహసిల్దార్ గాయత్రి, సిడిపిఓ పద్మావతి తదితరులు ఉన్నారు.