సోమవారం సెప్టెంబరు నెల పించన్ల పంపిణీకి సర్వసన్నద్ధం. 2,61,221 మందికి రూ 113.36 కోట్లు విడుదల. జిల్లా కలెక్టరు కె.వెట్రిసెల్వి …

ఏలూరు,ఆగస్టు 29:రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఎన్.టి.ఆర్. భరోసా పింఛన్లను సెప్టెంబరు నెలలో 2,61,221మంది ఫించన్ దారులకు రూ.113.36 కోట్ల రూపాయిలు పంపిణీ చేయడం జరుగుతుందని జిల్లా కలెక్టరు కె.వెట్రిసెల్వి తెలిపారు. సెప్టెంబరు నెల పింఛన్లు చెల్లింపులపై శుక్రవారం సంబంధిత అధికారులతో జిల్లా కలెక్టరు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టరు కె.వెట్రిసెల్వి మాట్లాడుతూ సెప్టెంబరు నెల పింఛను చెల్లింపులు సెప్టెంబరు 1వ తేదీ సోమవారం ఉదయం 7.00 గంటలకు ప్రారంభం అవుతుందన్నారు.అనివార్య కారణాలు వల్ల ఆరోజు పెన్షన్లు తీసుకొని వారికి సెప్టెంబరు 02 వ తేదీన పంపిణీ చేయాలన్నారు. జిల్లాలో 5,275 మంది సచివాలయ, ఇతర ప్రభుత్వ సిబ్బందితో పెన్షన్ల పంపిణీకి అన్ని ఏర్పాట్లు చేశామన్నారు.పింఛను పొందేందుకు పింఛను దారులు సచివాలయ సిబ్బంది ద్వారా వారి సంబంధిత ఇళ్లలో అందుబాటులో ఉండేలా ముందస్తు సమాచారం అందించాలన్నారు.అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ పెన్షన్ అందించే బాధ్యత ఆయా యంపిడివో లుపై ఉందని అన్నారు.
ఈ సమావేశం డిఆర్డిఏ పిడి ఆర్.విజయ రాజు, తదితరులు పాల్గొన్నారు.