అత్యవసర సమయంలో 108 వాహనాలు సమర్థవంతంగా సేవలందించాలి. 108 కొత్త వాహనాలు కొనుగోలుకు ప్రపోజల్స్ సిద్ధం చేయాలి. జిల్లా కలెక్టరు కె.వెట్రిసెల్వి …

ఏలూరు,ఆగస్టు 29:జిల్లా కలెక్టరేటు జిల్లా కలెక్టరు ఛాంబర్లో శుక్రవారం మెడికల్ కాలేజీ విద్యార్థిని, విద్యార్థులకు వసతిగృహా సౌకర్యాలు,104 వాహనాలు, తదితర అంశాలపై జిల్లా వైద్యరోగ్య శాఖ, డిసిహెచ్ యస్, మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్, సంబంధిత అధికారులతో జిల్లా కలెక్టరు కె.వెట్రిసెల్వి సుదీర్ఘంగా సమీక్షించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టరు కె.వెట్రిసెల్వి మాట్లాడుతూ జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా అవసరమైన వారికి శస్త్ర చికిత్సలు జరిగేలా వైద్యులు చూడాలన్నారు. వైద్యులు, వైద్య సిబ్బంది బాధ్యతతో పనిచేసి మంచి ఫలితాలు రాబట్టాలన్నారు. సిసి కెమెరాల ద్వారా వైద్య సిబ్బంది పనితీరును పర్యవేక్షించాలని అధికారులను ఆదేశించారు. మెడికల్ కాలేజీ టెక్నీషియన్లు, టెక్నికల్ పోస్టులను త్వరితగతిన భర్తీపక్రియను పూర్తి చేయాలన్నారు. శిథిలావస్థకు చేరిన 108 వాహనాలను ఆక్షన్ వేసి, కొత్త వాహనాలకు ప్రపోజల్స్ సిద్ధం చెయ్యాలని సంబంధిత అధికారులను కె.వెట్రిసెల్వి ఆదేశించారు. జిల్లా మెడికల్ కాలేజీ విద్యార్థిని, విద్యార్థులకు వసతి, విద్యాబోధన పట్ల సంతృప్తి చెందేలా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రస్తతం మెడికల్ విద్యార్థులు వసతికి ఏటువంటి ఇబ్బందులు లేవని, అయితే సెప్టెంబరు 5వ తేదీ నాటికి మూడవ బ్యాచ్ 150 మంది విద్యార్థులు వస్తారని వీరికి వేరే చోట అన్ని సౌకర్యాలు ఉన్న వసతి గృహ భవనాన్ని పరిశీలించాలని సూచించారు.ఈ లోపుగా మాతాశిశు భవనం రెండవ ఫ్లోర్లో తాత్కాలికంగా వసతి సౌకర్యాలు కల్పించాలని ఆదేశించారు. ఇదే హాస్పటల్లో ప్రస్తుతం ఉన్న డిసిహెచ్ యస్ కార్యాలయాన్ని వేరే చోట భవనానికి షిఫ్టు చేసి, ఖాళీ చేసిన భవనాన్ని హాస్పిటల్ కి అప్పజెప్పాలని అన్నారు. నర్సింగు కాలేజీ, నర్సింగు స్కూలు మరియు వసతి గృహాలు ప్రస్తుతం జనరల్ హాస్పిటల్ ఒక ఫోర్లు లో కార్యకలాపాలు జరుగుతున్నాయని, ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న మెడికల్ కాలేజీలోకి వీరిని షిఫ్టు చేయడానికి చర్యలు తీసుకోవాలన్నారు.ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న మెడికల్ కాలేజీ గ్రౌండు మరియు ఫస్ట్ ఫ్లోరు ఒక మాసంలో పూర్తి చేయాలని ఏపియంయస్ ఐడిసి అధికారులను జిల్లా కలెక్టరు ఆదేశించారు.
ఈ సమావేశంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డా.పి.జె. అమృతం, డిసిహెచ్ యస్ డా.బి.పాల్ రాజు, సూపర్డెంటు యం.యస్.రాజు, వైస్ ప్రిన్సిపాల్ డా.కె.భాస్కర్,108 మేనేజరు డి.రాజు, ఏపియంయస్ ఐడిసి ఇంజనీరు యు.యస్.వై.రాజబాబు, తదితర అధికారులు పాల్గొన్నారు.