జిల్లా ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపిన కలెక్టర్ కె. వెట్రిసెల్వి
Publish Date : 26/08/2025

ఏలూరు,ఆగస్టు 26: వినాయక చవితి సందర్భంగా జిల్లా కలెక్టర్ కె.వెట్రిసెల్వి జిల్లా ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఆది దేవుడైన వినాయకుడు సర్వ విఘ్నాలను తొలగించి జిల్లా ప్రజలకు మంచి చేకూర్చాలని ఆమె ఆకాంక్షించారు. ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉత్సవాలు నిర్వహించుకోవాలని, మట్టి గణపతిని పూజించాలని కోరారు.