• Social Media Links
  • Site Map
  • Accessibility Links
  • English
Close

కోడి గ్రుడ్లు పంపిణీ స్టాక్ పాయింట్ పరిశీలించిన జాయింట్ కలెక్టర్ పి.ధాత్రిరెడ్డి

Publish Date : 02/09/2025

భీమడోలు/ఏలూరు, సెప్టెంబరు 02:ఐసిడిఎస్ ప్రాజెక్ట్ భీమడోలు పరిధి లోగల సూరప్పగూడెంలో అంగన్వాడి కేంద్రాలకు సరఫరా చేసే కోడి గ్రుడ్లు స్టాక్ పాయింట్ ను మంగళవారం జాయింట్ కలెక్టర్ పి.ధాత్రిరెడ్డి ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. ఈ సందర్భంగా అంగన్వాడీ కేంద్రములకు పంపిణీ చేసే కోడిగ్రుడ్లు నాణ్యతను పరిశీలించారు.గ్రుడ్డు యొక్క బరువు 50 గ్రాములు ఉన్నవో లేవో బరువు తీయుట స్వయంగా పరిశీలించారు.
కోడిగ్రుడ్డు లోపలపదార్ధం యొక్క నాణ్యత ను పగలగొట్టి పరిశీలించారు.కోడి గ్రుడ్లులను నీటిలో వేసి నాణ్యతను పరిశీలించారు. పిమ్మట కోడిగుడ్లు పరిమాణం, నాణ్యత పై సంతృప్తి వ్యక్తం చేశారు. ఎక్కువ రోజులు గోడౌన్ నందు నిల్వ ఉంచకుండా ఎప్పటికప్పుడు కోడి గ్రుడ్లు సరఫరా చేయాలన్నారు.లబ్దిదారులకు అందించే పోషకాహరం నాణ్యత తగ్గకుండా గట్టి చర్యలు తీసుకోవాలన్నారు.ప్రభుత్వం ద్వారా అంగన్వాడీ కేంద్రములకు పంపిణీ చేసే పోషకాహరం ప్రమాణాలు
నాణ్యతగా ఉండాలని ఆదేశించారు. జిల్లాలో ప్రతి ప్రాజెక్ట్ లోను సంబంధిత సిడిపిఓలు క్రమం తప్పక ప్రతి నెల స్టాక్ పాయింట్ లు తనిఖీ చేయాలనీ ఆ వివవరాలు రికార్డు చేయాలనీ ఆదేశించారు.

కార్యక్రమంలో జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ ప్రాజెక్ట్ డైరెక్టర్ పి.శారద, భీమడోలు ప్రాజెక్ట్ సిడిపిఓ యం.యస్. రాజశేఖర్ పాల్గొన్నారు.