Close

ఏలూరు జిల్లాలో నెల రోజులపాటు సూపర్ జీఎస్టీ… సూపర్ సేవింగ్స్ పేరుతో విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. విజయానంద్ కు తెలిపారు.

Publish Date : 26/09/2025

ఏలూరు, సెప్టెంబర్, 26 : ఏలూరు జిల్లాలో నెల రోజులపాటు సూపర్ జీఎస్టీ… సూపర్ సేవింగ్స్ పేరుతో విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. విజయానంద్ కు తెలిపారు. జీఎస్టీ 2.O విస్తృత అవగాహన,. అన్నా కేంటీన్ల నిర్వహణ, పురపాలక సంఘాలలో పారిశుధ్యంలపై ప్రజల సంతృప్తి స్థాయి, పి.ఎం.కుసుమ్ తదితర అంశాలపై రాష్ట్ర సచివాలయం నుండి జిల్లాల కలెక్టర్లతో శుక్రవారం సీఎస్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ఏలూరు జిల్లా నుండి జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి జిల్లాలో చేపట్టిన కార్యక్రమాలను సీఎస్ కి వివరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ వెట్రిసెల్వి మాట్లాడుతూ జీఎస్టీ తగ్గింపుతో ప్రతీ కుటుంబానికి ఎంతమేరకు ఆదా అవుతుందో తెలియజేసేందుకు సూపర్ జీఎస్టీ… సూపర్ సేవింగ్స్ పేరుతో నెల రోజులపాటు విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. ప్రజల సంతృప్తి స్థాయి మేరకు అన్నా కేంటీన్ల నిర్వహణలో నాణ్యమైన ఆహరం, పరిశుభ్రత పాటిస్తున్నామని, మునిసిపాలిటీలలో పారిశుధ్య కార్యక్రమాలు అమలుచేస్తున్నామని కలెక్టర్ తెలియజేసారు. ఈ సందర్భంగా సీఎస్ విజయానంద్ మాట్లాడుతూ జీఎస్టీ తగ్గింపు వివరాలు ప్రతీ ఒక్కరికీ తెలియజేసేలా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. ప్రభుత్వ పధకాల అమలులో ప్రజల సంతృప్తి స్థాయి పెరిగేలా అధికారులు ప్రత్యేక శ్రద్ద తీసుకోవాలన్నారు. అన్నా కేంటీన్లలో నాణ్యమైన ఆహరం అందించాలని, పరిశుభ్రత పాటించేలా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రస్తుత వర్షాకాలంలో మునిసిపాలిటీలు, గ్రామాలలో ఎటువంటి అంటువ్యాధులు, విష జ్వరాలు ప్రభలకుండా పారిశుధ్య చర్యలు తీసుకోవాలన్నారు.
కార్యక్రమంలో కమర్షియల్ టాక్స్ జాయింట్ కమీషనర్ బి. నాగార్జునరావు, ఏలూరు నగరపాలక సంస్థ కమీషనర్ ఏ . భానుప్రతాప్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.