అహింసా మార్గంలో దేశానికి స్వాతంత్రం సాధించిన మహాత్మా గాంధీ జీవితం ప్రతీ ఒక్కరికీ ఆదర్శనీయమని జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి చెప్పారు.
ఏలూరు, అక్టోబర్, 2 : అహింసా మార్గంలో దేశానికి స్వాతంత్రం సాధించిన మహాత్మా గాంధీ జీవితం ప్రతీ ఒక్కరికీ ఆదర్శనీయమని జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి చెప్పారు. గాంధీ జయంతి సందర్భంగా గురువారం స్థానిక కలెక్టరేట్లోని గాంధీజీ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం కలెక్టరేట్లోని గౌతమీ సమావేశపు హాలులో గాంధీజీ చిత్రపటానికి పూలమాల వేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ వెట్రిసెల్వి మాట్లాడుతూ గ్రామాల అభివృద్ధి ద్వారా దేశాభివృద్ధి సాధ్యమన్న గాంధీజీ గ్రామా స్వరాజ్య సాధనకు కృషిచేశారన్నారు. వ్యక్తిగత, పరిసరాల పరిశుభ్రతతో రోగాలు దరిచేరవని ఆనాడే గ్రహించి గాంధీజీ పరిశుభ్రతకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చేవారన్నారు. గాంధీజీ ఆశయాల మేరకు సంపూర్ణ పారిశుద్ధ్యంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టి స్వచ్చంద్ర ద్వారా స్వర్ణాంధ్ర సాధనకు కృషి చేస్తున్నదన్నారు.
కార్యక్రమంలో జిల్లా రెవిన్యూ అధికారి వి. విశ్వేశ్వరరావు, జిల్లా పరిషత్ సీఈఓ శ్రీహరి, డిఆర్దిఏ పీడీ విజయరాజు, బిసి కార్పొరేషన్ ఈడి పుష్పలత, కలెక్టరేట్ సిబ్బంది పాల్గొన్నారు.