స్వర్ణాంధ్ర _ స్వచ్ఛ ఆంధ్ర లో భాగంగా ” స్వచ్ఛ ఆంధ్ర” అవార్డులను ప్రకటించిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అవార్డుల సాధించిన వారి పేర్లను పాత్రికేయుల సమావేశంలో వెల్లడించిన జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి
ఏలూరు, అక్టోబర్, 2 : జిల్లాలో అత్యుత్తమ స్థాయిలో పారిశుద్ధ్య కార్యక్రమాలు నిర్వహించినందుకు గాను 2 రాష్ట్రస్థాయి , 51 జిల్లా స్థాయి స్వర్ణాంధ్ర-స్వచ్చంద్ర-2025 అవార్డులు సాధించామని జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి చెప్పారు. స్థానిక కలెక్టరేట్లోని గౌతమీ సమావేశపు హాలులో జిల్లా సాధించిన స్వర్ణాంధ్ర-స్వచ్చంద్ర-2025 అవార్డుల వివరాలను గురువారం పాత్రికేయుల సమావేశంలో కలెక్టర్ వివరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ వెట్రిసెల్వి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ స్వచ్ఛ సర్వేక్షన్ కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన స్వర్ణాంధ్ర-స్వచ్చంద్ర కార్యక్రమంలో జిల్లాలో ఘన మరియు ద్రవ వ్యర్థాల నిర్వహణ, బహిరంగ ప్రదేశాలలో పరిశుభ్రత, సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిషేధం, RRR (పునర్వినియోగం తగ్గించు రీసైకిల్) మరియు స్థిరమైన పద్ధతులలో కొత్త ప్రమాణాలతో పారిశుద్ధ్య కార్యక్రమాలు నిర్వహించినందుకు గాను 2 రాష్ట్రస్థాయి , 51 జిల్లా స్థాయి స్వర్ణాంధ్ర-స్వచ్చంద్ర-2025 అవార్డులు సాధించామన్నారు. జిల్లాలో స్వచ్చంద్ర అవార్డులకు గాను 17 విభాగాలలో 1, 20, 057 కేంద్రాలు పాల్గొనగా, 1317 జిల్లా స్థాయి నామినేషన్లు ఎంపికయ్యాయని, చివరికి 62 రాష్ట్ర స్థాయి అవార్డులకు పోటీ పడ్డారన్నారు. వాటిలో రాష్ట్ర స్థాయిలో 2 అవార్డులు, జిల్లా స్థాయిలో 51 అవార్డులు సాధించామన్నారు.
రాష్ట్ర స్థాయి అవార్డులలో ఉత్తమ స్వచ్ఛ గ్రీన్ అంబాసిడర్ గా జీలుగుమిల్లి మండలం పి . అంకంపాలెం కు చెందిన ఎన్ . సూరమ్మ, స్వచ్చ రెసిడెన్షియల్ పాఠశాలగా విప్పలపాడు లోని ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ పాఠశాల ఎంపికైందన్నారు.
జిల్లా స్థాయి అవార్డులలో ఉత్తమ స్వచ్ఛ పురపాలక సంఘంగా జంగారెడ్డిగూడెం పురపాలక సంఘం, స్వచ్ఛ గ్రామ పంచాయతీలుగా జీలుగుమిల్లి మండలం కామయ్యపాలెం, కొయ్యలగూడెం మండలం కన్నాపురం, ముసునూరు మండలం సూరేపల్లి, నిడమర్రు మండలం ఛానమిల్లి, ఉంగుటూరు మండలం చేబ్రోలు గ్రామ పంచాయతీలు ఎంపికయ్యాయన్నారు. ఉత్తమ స్వచ్ఛ స్లం లెవెల్ ఫెడరేషన్స్ గా జంగారెడ్డిగూడెంలో ఇందిరా క్రాంతిపథం, ఏలూరులోని ఆదర్శ 2 స్లం సమాఖ్య, నూజివీడులో రాజీవ్ సమాఖ్య లు, ఉత్తమ స్వచ్ఛ రైతు బజార్ గా కలిదిండి రైతు బజార్, ఉత్తమ స్వచ్ఛ విలేజ్ ఆర్గనైజేషన్స్ విభాగంలో కలిదిండి మండలం సానరుద్రవరం , కామవరపుకోట మండలం కాళ్లచెరువు, మండవల్లి మండలం పెరికేగూడెం, నూజివీడు మండలం వెంకటాయపాలెం, ఉంగుటూరు మండలం వెల్లమిల్లి విలేజ్ ఆర్గనైజేషన్స్ అవార్డులు సాదించాయన్నారు. ఉత్తమ స్వచ్ఛ బస్ స్టేషన్ గా ఏలూరు బస్ స్టేషన్, ఉత్తమ స్వచ్చంద సంస్థల విభాగంలో రెడ్ క్రాస్ సొసైటీ, మానవతా , పరివర్తన్ సంస్థలు, అవార్డులు సాదించాయన్నారు. ఉత్తమ స్వచ్ఛ ఆసుపత్రులుగా ఉంగుటూరు మండలంలోని కాగుపాడు పిహెచ్సి, భీమడోలు సిహెచ్సి , చాట్రాయి మండలం చిత్తాపూర్ లో ప్రభుత్వ ఆసుపత్రి, ఉత్తమ స్వచ్ఛ పాఠశాలలుగా కలిదిండి మండలంలోని ఆరుతీగలపాడు జిల్లా పరిషత్ హైస్కూల్, జంగారెడ్డిగూడెంలో జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల, ఏలూరులోని పాండురంగ స్పెషల్ మునిసిపల్ ప్రైమరీ స్కూల్, నూజివీడు మండలం ఈస్ట్ దిగవల్లిలోని ఎంపిపి పాఠశాల, వేలేరుపాడు మండలంలోని కెజిబివి పాఠశాలకు అవార్డులు పొందాయన్నారు. ఉత్తమ స్వచ్ఛ అంగన్వాడీ కేంద్రాలుగా ద్వారకాతిరుమల మండలం తిరుమలపాలెం, భీమడోలు మండలం అంబర్ పేట, ఏలూరు , చింతలపూడి , దెందులూరు మండలం కొవ్వలి లోని అంగన్వాడీ కేంద్రాలు, స్వచ్ఛ ప్రభుత్వ కార్యాలయాలుగా ఏలూరు నగరపాలక సంస్థ, ఏలూరులోని జిల్లా పరిషత్ కార్యాలయం, మైనారిటీస్ సంక్షేమ శాఖ కార్యాలయాలు, స్వచ్ఛ పరిశ్రమల విభాగంలో నవభారత్ ఆగ్రో ప్రొడక్ట్స్ కంపెనీలు అవార్డులు సాదించాయన్నారు. ఉత్తమ స్వచ్ఛ ఎంఎస్ఎంఈ విభాగంలో ఏలూరులోని గ్రోవెల్ ప్రొసెసర్స్ ప్రైవేట్ లిమిటెడ్, పైప్లైన్ ఇంఫ్రాస్ట్రుక్చర్ లిమిటెడ్ కంపెనీ లు, ఉత్తమ స్వచ్ఛ హాస్టల్స్ విభాగంలో నిడమర్రు మండలంలోని పెదనిండ్రకొలను లోని సాంఘిక సంక్షేమ బాలికల హాస్టల్, ఏలూరులోని ప్రభుత్వ బిసి బాలికల హాస్టల్-2, బుట్టంగూడెం మండలంలోని లంకపల్లి లోని జిటిడబ్ల్యూ బాలికల ఆశ్రమ పాఠశాల, ఉత్తమ స్వచ్ఛ రెసిడెన్షియల్ పాఠశాలల విభాగంలో బుట్టగూడెం మండలం అంతర్వేదిగూడెంలోని జిటిడబ్ల్యూ బాలుర ఆశ్రమ పాఠశాలలు అవార్డులు పొందాయన్నారు. ఉత్తమ స్వచ్ఛ పారిశుద్ధ్య కార్మికులుగా ఏలూరులోని సాక భాస్కరరావు, కొడవకంటి సునీత, జంగారెడ్డిగూడెంలో దోసూరి మంగమ్మ, చింతలపూడిలో ఎస్. వర కుమార్ లు, ఉత్తమ స్వచ్ఛ గ్రీన్ అంబాసిడర్ లుగా చేబ్రోలు కు చందిన ఎల్. ప్రసాదరావు, సింగగూడెం నకు చెందిన శీకాకాలు పుల్లయ్య కు, వేదాంతపురం నకు చెందిన జొన్నకూటి యేసు, పోతురెడ్డిపల్లి కి చెందిన రెడ్డి కొడనాల రామయ్యలు అవార్డులు సాధించారని కలెక్టర్ వెట్రిసెల్వి తెలియజేసారు.
రాష్ట్ర స్థాయి అవార్డుగ్రహీతలకు ముఖ్య మంత్రి చంద్ర బాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చేతుల మీదుగా ఈనెల 6వ తేదీన రాష్ట్రస్థాయి కార్యక్రమంలో అవార్డులు ప్రధానం జరుగుతుందని, అదేరోజు జిల్లాస్థాయి ఏలూరులో స్వచ్ఛ ఆంధ్ర అవార్డులను జిల్లా ఇన్‌చార్జ్ మంత్రి, ప్రజా ప్రతినిధులు, అధికారుల సమక్షంలో అవార్డులు అందించి సత్కరించడం జరుగుతుందాని కలెక్టర్ తెలిపారు.
జిల్లా పరిషత్ సీఈఓ శ్రీహరి, ప్రభృతులు పాల్గొన్నారు.