Close

ఏలూరు ఘనంగా అంతర్జాతీయ వృద్దుల దినోత్సవ వేడుకలు హాజరైన జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి

Publish Date : 01/10/2025

ఏలూరు, అక్టోబర్, 1 : అంతర్జాతీయ వృద్ధుల దినోత్సవ జిల్లా స్థాయి వేడుకలు ఏలూరు కలెక్టరేట్లోని గోదావరి సమావేశపు హాలులో బుధవారం ఘనంగా నిర్వహించారు. వేడుకలకు ఏలూరు జిల్లా నలుమూలల నుండి దాదాపు 150 మంది వయో వృద్దులు హాజరయ్యారు.

కార్యక్రమంలో ముఖ్యఅతిధిగా పాల్గొన్న జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి మాట్లాడుతూ వయోవృద్ధుల సంక్షేమానికి కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నదన్నారు. కన్న బిడ్డల నిరాధరణకు గురైన లేదా కన్న బిడ్డల చేతిలో మోసపోయిన తల్లితండ్రులు తమ దగ్గరలోని తహసీల్దార్, ఆర్డీఓ వారిని కలిసి న్యాయం కోసం దరఖాస్తు చేయవచ్చని, వెంటనే వారి పిల్లలపై కేసులు నమోదు చేసి వృద్దులకు న్యాయం చేయడం జరుగుతుందన్నారు. అర్హులైన ప్రతీ వృద్దులకు పెన్షన్ అందిస్తున్నామని, అర్హత ఉంది ఇంకా పెన్షన్ రాని వారు దగ్గరలోని గ్రామ/వార్డ్ సచివాలయంలో దరఖాస్తు అందించవచ్చన్నారు.