జిల్లా కలెక్టరు కె.వెట్రిసెల్వి , జిల్లా ఎస్పీ కె.ప్రతాప్ శివ కిషోర్, జిల్లా జాయింటు కలెక్టరు యం.జె.అభిషేక్ గౌడ హెల్మెంట్లు ధరించి స్వయంగా బైక్ లు నడిపి ప్రజలకు జోష్ నింపారు.
ఏలూరు,అక్టోబరు13: సూపర్ జిఎస్టి, సూపర్ సేవింగ్స్ లో భాగంగా సోమవారం స్థానిక శాంతినగర్ పోలీసు పెట్రోల్ బంకు నుండి పాత బస్టాండు వరకు బైక్ ర్యాలీ జెండా ఊపి లాంఛనంగా ప్రారంభించి, జిల్లా కలెక్టరు కె.వెట్రిసెల్వి , జిల్లా ఎస్పీ కె.ప్రతాప్ శివ కిషోర్, జిల్లా జాయింటు కలెక్టరు యం.జె.అభిషేక్ గౌడ హెల్మెంట్లు ధరించి స్వయంగా బైక్ లు నడిపి ప్రజలకు జోష్ నింపారు. ఈ బైక్ ర్యాలీ శాంతినగరు పోలీసు పెట్రోల్ బంకు నుండి పాత బస్టాండు వరకు సాగింది.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టరు కె.వెట్రిసెల్వి మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జిఎస్టీ సంస్కరణలు వల్ల తగ్గిన ధరలు ప్రతి కుటుంబానికి ఆర్థికలబ్ధి కలుగుతుందన్నారు. వినియోగ వస్తువులు ధరలు గణనీయంగా తగ్గాయని, ప్రజలకు ఈ లాభాలు ప్రత్యక్షంగా చేరేలా విస్తృత అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నామని తెలిపారు. సూపర్ జీఎస్టీ – సూపర్ సేవింగ్స్ ప్రచారం ద్వారా ప్రజలలో అవగాహన పెంపొందించడం ముఖ్య ఉద్దేశ్యమని పేర్కొన్నారు. టీవీలు, ఏసీలు, మిక్సీలు, వాషింగ్ మిషన్లు వంటి ఎలక్ట్రానిక్ వస్తువులపై జీఎస్టీ తగ్గింపుతో వినియోగ దారులకు రూ 5 వేలు నుండి రూ 15 వేలు వరకు లబ్ధి చేకూరుతోందని తెలిపారు. జీఎస్టీ తగ్గింపు వల్ల పేద, మధ్యతరగతి వర్గాలు కుటుంబాలకు ఆర్థిక లాభం కలుగుతోందని చెప్పారు. ఎవ్వరైనా ఇంకనూ పాత రేట్లకే వస్తువులు అమ్మినచో ప్రశ్నించాలని, టోల్ ఫ్రీ నెంబరు ఫోన్ చెయ్యాలని అన్నారు.
కార్యక్రమంలో వాణిజ్యపన్నుల శాఖ జాయింట్ కమీషనరు నాగార్జున రావు, జెడ్పీ సిఇవో యం.శ్రీహరి, ఆర్డీవో యం.అచ్యుత అంబరీష్, ఉప రవాణా కమీషనరు షేక్ కరీం, కార్మిక శాఖ డిప్యూటీ కమీషనరు జి.నాగేశ్వరరావు, నగర పాలక సంస్థ కమీషనరు ఏ.భాను ప్రతాప్, వివిధ శాఖల అధికారులు, పట్టణ ప్రముఖులు, విద్యార్థిని, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.