Close

సమాజంలో విభిన్న ప్రతిభావంతులు ఆత్మస్థైర్యంతో జీవించేలా ప్రతీ ఒక్కరూ సహకరించాలని జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి పిలుపునిచ్చారు. స్థానిక కలెక్టరేట్ లో బుధవారం జాతీయ వైట్ కేన్ దినోత్సవం సందర్భంగా కలెక్టరేట్ వద్ద ర్యాలీ ని కలెక్టర్ వెట్రిసెల్వి ప్రారంభ

Publish Date : 15/10/2025

ఏలూరు, అక్టోబర్, 15 : సమాజంలో విభిన్న ప్రతిభావంతులు ఆత్మస్థైర్యంతో జీవించేలా ప్రతీ ఒక్కరూ సహకరించాలని జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి పిలుపునిచ్చారు. స్థానిక కలెక్టరేట్ లో బుధవారం జాతీయ వైట్ కేన్ దినోత్సవం సందర్భంగా కలెక్టరేట్ వద్ద ర్యాలీ ని కలెక్టర్ వెట్రిసెల్వి ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ వెట్రిసెల్వి మాట్లాడుతూ విభిన్న ప్రతిభావంతుల సంక్షేమం కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నో సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్నాయన్నారు. వాటిని సద్వినియోగం చేసుకుని వాటి జీవన ప్రమాణాలు మెరుగుపరచుకోవాలన్నారు. అర్హులైన ప్రతీ దివ్యంగులకు ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు అందిస్తున్నామని, ఇంకా ఎవరైనా సంక్షేమ కార్యక్రమాల కోసం దరఖాస్తు చేసుకోవాలనుకుంటే ఏలూరు కలెక్టరేట్ ఆవరణలోని విభిన్న ప్రతిభావంతుల సంక్షేమ శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ కార్యాలయంలో తమ దరఖాస్తులు సమర్పిస్తే, తప్పక పరిశీలించి మంజూరు చేస్తామన్నారు.
కార్యక్రమంలో విభిన్న ప్రతిభావంతుల సంక్షేమ శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ రామ్ కుమార్, విజువల్లీ ఛాలెంజెడ్ ఎంప్లాయిస్ అసోసియేషన్ రాష్ట్ర కార్యనిర్వాహాక కార్యదర్శి జి. రాధ రాణి, ఏలూరు జిల్లా అధ్యక్షులు జి. డి. వి. ఎస్. వీర భద్రరావు, జిల్లా ప్రధాన కార్యదర్శి కె. మదన్, అసోసియేట్ ప్రెసిడెంట్ ఆర్. కర్ణుడు, కోశాధికారి వై. రమేశ్ తదితరులు పాల్గొన్నారు.
కలెక్టరేట్ నుండి ప్రారంభమైన ర్యాలీ జన్మభూమి పార్క్ మీదుగా ఏటిగట్టు నుండి తిరిగి కలెక్టరేట్ కి చేరుకుంది.