రేపటి సాయంత్రానికి 8 వేలు ఏకరాలు రిజిస్ట్రేషన్లు చేసి పూర్తిస్తాయి నివేదికను సమర్పించాలి. జిల్లా కలెక్టరు కె.వెట్రిసెల్వి …
ఏలూరు, అక్టోబరు15: జిల్లా కలెక్టరేటు గోదావరి సమావేశ మందిరంలో బుధవారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆక్వాకల్చర్ అభివృద్ధి ఆధారిటీ ఆక్ట్ ను ననుసరించి జిల్లాలోని ఆక్వా చెరువులు అప్సడా రిజిస్ట్రేషన్లు పక్క్రియపై సంబంధిత అధికారులతో జిల్లా కలెక్టరు కె.వెట్రిసెల్వి అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. జిల్లాలో ఆక్వాసాగులో ఉన్న పది మండలాల్లో గ్రామాలు వారీగా సుదీర్ఘంగా సమీక్షించారు. కనీసం 50 శాతం పూర్తి చేయలేక పోయారని జిల్లా కలెక్టరు అసహనం వ్యక్తం చేశారు. టార్గెట్ పూర్తి చెయ్యని అధికారులను, అసిస్టెంట్లను సస్పెండు చేస్తానని జిల్లా కలెక్టరు కె.వెట్రిసెల్వి హెచ్చరించారు. ఇబ్బందులను ఏదుర్కొకునేలా అధికారులు క్షేత్రస్థాయిలో మకాంవేసి టార్గెట్ వేగవంతం చేసి లక్ష్యాలను అధిగమించాలని ఆదేశించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టరు కె.వెట్రిసెల్వి మాట్లాడుతూ జిల్లాలో ఆక్వా ఉన్న మండలాలు కైకలూరు, కలిదిండి, మండవల్లి, ముదినేపల్లి, ఏలూరు, దెందులూరు, పెదపాడు, నిడమర్రు, ఉంగుటూరు, భీమడోలు మొత్తం పది మండలాల్లో 1 లక్షా 49 వేల, 828 ఏకరాలు ఉండగా ఇప్పటివరకు 52,613 ఏకరాలు అప్సడా రిజిస్ట్రేషన్లు పక్క్రియ పూర్తి అయిందని, ఇంకనూ 97 వేలు 215 ఏకరాలు రిజిస్ట్రేషన్లు చెయ్యవలసి ఉన్నదని తెలిపారు. యల్ పియం అప్డేషన్ వెంటనే చేసి రేపటి సాయంత్రానికి కనీసం 8 వేల ఏకరాలు రిజిస్ట్రేషన్ లోకి తీసుకువచ్చి ప్రగతి చూపించాలని ఆదేశించారు. మరియు ఆక్వా జొనేషన్ ప్రపోజల్ డేటా వెంటనే ఆన్లైన్ చెయ్యడం ద్వారా జోన్ లోకి వచ్చే 22,905 ఏకరాలు వెంటనే ప్రాసెస్ చెయ్యాలని సూచించారు. కొల్లేరు భూములు వైల్డ్ లైఫ్ పరిధిలో ఉంటుంది కాబట్టి ఆ భూములు లైసెన్స్ ఇవ్వరాదని తెలిపారు. రైతులు అందుబాటులో లేని యెడల లీస్ హోల్డర్ లైసెన్సులు ఇవ్వాల్సిందిగా మరియు రైతులు ఆధారు లేదా వెబ్ ల్యాండు లింకు అవ్వని యెడల సివోసి సర్టిఫికెటు ఆఫ్ కల్టివేషన్ ద్వారా లైసెన్సులు ఇవ్వాల్సిందిగా ఆదేశించారు.
ఈ సమావేశంలో విజయవాడ మత్స్యశాఖ కమీషరు కార్యాలయం జాయింటు డైరెక్టరు షేక్. లాల్ మొహమ్మద్, జిల్లా మత్స్యశాఖ డిడి బి.నర్సయ్య, సహాయ సంచాలకులు బి.రాజ్ కుమార్, కె.రవికుమార్, మండల మత్స్యశాఖ అధికారులు, గ్రామాల మత్స్యశాఖ సహాయకులు, జిల్లా మత్స్యశాఖ ఉద్యోగులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.