Close

జిల్లాలో ఈ-పంట, ఈ- కెవైసి నూరుశాతం పూర్తి చేయాలి – వ్యవసాయాధికారులతో జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి టెలి కాన్ఫరెన్స్

Publish Date : 14/10/2025

ఏలూరు, అక్టోబర్, 14 : జిల్లాలో ఈ-పంట, ఈ- కెవైసి నూరుశాతం పనులు త్వరితగతిన పూర్తిచేయాలని జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి వ్యవసాయాధికారులను ఆదేశించారు. స్థానిక కలెక్టరేట్ నుండి మంగళవారం సాయంత్రం ఈ-పంట, ఈ- కెవైసి లపై వ్యవసాయ శాఖ అధికారులు, సిబ్బందితో కలెక్టర్ టెలి కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ వెట్రిసెల్వి మాట్లాడుతూ జిల్లాలో 4. 92 లక్షల ఎకరాలకు సంబంధించి ఈ – పంట నమోదు చేయాల్సి ఉండగా, 96. 6 శాతం 4. 77 లక్షల ఎకరాలలో పూర్తి చేసి, రాష్ట్రంలో రెండవ స్థానంలో నిలిచామన్నారు. దీనిలో 1. 85 లక్షల ఎకరాలలో వరి సాగు ఉన్నదన్నారు. అదేవిధంగా ఈ-కెవైసి కూడా వెంటనే పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. తుఫాను, వరదలు వంటి ప్రకృతి వైపరీత్యాల సమయంలో రైతులు భీమా, పరిహారం పొందాలంటే ఈ-పంట, ఈ- కెవైసి నమోదై ఉండాలన్నారు. కావున గ్రామ స్థాయిలోని వ్యవసాయ శాఖ సిబ్బంది రైతులకు ఈ-పంట, ఈ- కెవైసి లపై అవగాహన కలిగించి నూరు శాతం ఈ-పంట, ఈ- కెవైసి పూర్తి అయ్యేలా చర్యలు తీసుకోవాలన్నారు.

జిల్లా వ్యవసాయాధికారి హబీబ్ భాషా, వ్యవసాయ శాఖ ఏడి లు, మండల వ్యవసాయ శాఖాధికారులు, ప్రభృతులు పాల్గొన్నారు.