Close

ఏలూరు జిల్లాలో 8 ప్రదేశాలలో రైల్వే ఓవర్ బ్రిడ్జి/రైల్వే అండర్ బ్రిడ్జి నిర్మాణాలకు సంబంధించి భూసేకరణ పనులు వేగవంతం చేయాలనీ జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి అధికారులను ఆదేశించారు.

Publish Date : 14/10/2025

ఏలూరు, అక్టోబర్, 14 : ఏలూరు జిల్లాలో 8 ప్రదేశాలలో రైల్వే ఓవర్ బ్రిడ్జి/రైల్వే అండర్ బ్రిడ్జి నిర్మాణాలకు సంబంధించి భూసేకరణ పనులు వేగవంతం చేయాలనీ జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి అధికారులను ఆదేశించారు. జిల్లాలో నిర్మించనున్న రైల్వే ఓవర్ బ్రిడ్జి/రైల్వే అండర్ బ్రిడ్జి నిర్మాణాలకు సంబంధించి భూసేకరణపై అధికారులతో మంగళవారం కలెక్టరేట్ నుండి సంబంధిత అధికారులతో కలెక్టర్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ వెట్రిసెల్వి మాట్లాడుతూ ఏలూరులోని పవర్ పేట గేటు వద్ద , దెందులూరు మండలంలోని సీతంపేట, శ్రీరామవరం, జాతీయ రహదారిని అనుకుని భీమడోలు రైల్వే గేట్, పూళ్ల , కైకరం, చేబ్రోలు, ఉంగుటూరు స్టేషన్ వద్ద రైల్వే ఓవర్ బ్రిడ్జి/రైల్వే అండర్ బ్రిడ్జి ల నిర్మాణానికి సంబంధించి భూ సేకరణ పనులు నిర్దేశించిన సమయంలోగా పూర్తిచేయాలన్నారు. భూసేకరణలో ప్రజలు నుండి ఎటువంటి అభ్యంతరాలు లేకుండా, ఎటువంటి శాంతిభద్రతల సమస్యలు లేకుండా చూడాలన్నారు.

డిఆర్ఓ వి. విశ్వేశ్వరరావు, ఆర్డీఓ అచ్యుత్ అంబరీష్, సంబంధిత మండలాల తహసీల్దార్లు, రైల్వే అధికారులు, తదితరులు పాల్గొన్నారు.