Close

జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు, కళాశాలలు, అంగన్వాడీలకు ఈనెల 27, 28 తేదీలలో సెలవు తుఫాన్ తీవ్రతపై జిల్లా ఎస్పీతో కలిసి అధికారులను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అప్రమత్తం చేసిన జిల్లా కలెక్టర్ కె వెట్రిసెల్వి

Publish Date : 26/10/2025

ఏలూరు, అక్టోబర్, 26 : ఏలూరు జిల్లాలో ‘మొంథా తుఫాన్’ ప్రభావంతో ఈనెల 27 నుండి 29వ తేదీ వరకు తీవ్రగాలులు, భారీ వర్షాల కారణంగా హోర్డింగ్ లు కూలే ప్రమాదం ఉందన్న వాతావరణ శాఖ హెచ్చరికలతో వాటి కారణంగా ప్రాణ నష్టం జరగకుండా తగు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి అధికారులను ఆదేశించారు. తుఫాన్ తీవ్రతపై జిల్లా యంత్రాంగం తీసుకోవలసిన ముందస్తు జాగ్రత్త చర్యలపై జిల్లా ఎస్పీతో కలిసి ఆదివారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అధికారులను జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి అప్రమత్తం చేశారు ఈ సందర్భంగా కలెక్టర్ వెట్రిసెల్వి మాట్లాడుతూ తోఫాన్ సమయంలో 120 కిలోమీటర్ల వేగంతో తీవ్రగాలులు వీస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించిందని, దీని కారణంగా హోర్డింగ్ లు, ఆస్బెస్టాస్ రేకులు, ఐరన్ రేకులు ఎగిరిపోయి అవకాశం ఉందని, ప్రజలు .. ప్రజలు అప్రమత్తం ఉండాలన్నారు. తుఫాన్ పరిస్తితి దృష్ట్యా జిల్లాలో ప్రభుత్వ, ప్రైవేట్ విద్యా సంస్థలకు, కళాశాలలు, అంగన్వాడీలకు ఈనెల 27, 28 తేదీలలలో సెలవు ప్రకటించడమైందని, ప్రైవేట్ విద్యా సంస్థలలో స్టడీ అవర్స్ వంటివి నిర్వహించకుండా విద్యా శాఖ అధికారులు పరిశీలించాలన్నారు. గోదావరి నదిలోని పర్యాటక లాంచీలు వెళ్లకుండా చర్యలు తీసుకోవాలన్నారు. అన్ని మండల, డివిజన్ స్థాయిలో కంట్రోల్ రూంలు ఏర్పాటు చేయాలన్నారు. జిల్లా స్థాయిలో కంట్రోల్ రూమ్ నెంబర్ 9491041419, టోల్ ఫ్రీ నెంబర్ 18002331077 లకు ఫోన్ చేసి ప్రజలు తూఫాన్ పరిస్థితి తెలుసుకోవచ్చని, అవసరమైన సహాయం పొందవచ్చన్నారు. తూఫాన్ సమయంలో చెట్లు కూలి రవాణా సౌకర్యాలకు ఎటువంటి ఆటంకం కలగకుండా వెంటనే చెట్లు తొలగించేలా అధికారులు చర్యలు తీసుకునేందుకు సిద్ధంగా ఉండాలన్నారు. తూఫాన్ సమయంలో ప్రజలకు అవసరమైన సేవలు అందించేందుకు ప్రతీ గ్రామానికి ఒక నోడల్ అధికారిని నియమించాలని, శిధిలావస్థలో ఉన్న భవనాలు, ఇళ్లల్లోని వ్యక్తులను, లోతట్టు ప్రాంతాల ప్రజలను ఆదివారం రాత్రి నుండి సురక్షిత ప్రాంతాలకు తరలించాలన్నారు. నదులు వాగులోకి ప్రజలు వెళ్లకుండా చూడాలని, కల్వర్టులు, కాజ్ వే లు, వాగులను ప్రజలు దాటకుండా హెచ్చరిక బోర్డులు ఏర్పాటుచేయడంతోపాటు, ఆ ప్రదేశాలలో సిబ్బందిని నియమించి పర్యవేక్షించాలన్నారు. మత్స్యకారులు చేపల వేటకు వెళ్లకుండా అప్రమత్తం చేయాలన్నారు. తూఫాన్ తీరం దాటే సమయంలో తీవ్రమైన గాలులు వీస్తాయని, ప్రజలు ఇంటినుండి బయటకు రావద్దన్నారు. ఏలూరు నగరపాలక సంస్థ పరిధిలో డ్రైన్లలో వరద నీరు చేరి నివాసిత ప్రాంతాలు ముంపునకు గురికాకుండా డ్రైన్లలో మురుగును వెంటనే తొలగించాలన్నారు. తీవ్రమైన గాలులు సమయంలో విద్యుత్ స్థంబాలు కూలే అవకాశం ఉన్నందున, విద్యుత్ సంస్థ అధికారులు తక్షణమే చర్యలు తీసుకునేందుకు సిద్ధంగా ఉండాలని, జిల్లా, డివిజన్ స్థాయిలో విద్యుత్ సంస్థ కంట్రోల్ రూంలు ఏర్పాటుచేయాలన్నారు. తూఫాన్ సహాయక కేంద్రాల వద్ద విద్యుత్ సరఫరాకు అంతరాయం లేకుండా జనరేటర్ లను ఏర్పాటు చేయాలన్నారు. సెల్ ఫోన్ టవర్ల వద్ద సెల్ఫోన్ నెట్వర్క్ కు అంతరాయం లేకుండా జనరేటర్ లు ఏర్పాటుచేయాలని, వాటికి అవసరమైన డీజిల్ సిద్ధంగా ఉంచుకోవాలన్నారు. తూఫాన్ పునరావాస కార్యక్రమాలకు రాష్ట్రం నుండి ఎస్డిఆర్ఎఫ్ బలగాలు జిల్లాకు విచ్చేస్తున్నాయని కలెక్టర్ వెట్రిసెల్వి తెలియజేసారు.
జిల్లా ఎస్పీ కె. ప్రతాప్ శివకిశోర్ మాట్లాడుతూ మండల స్థాయిలోని పోలీస్ స్టేషన్ల పరిధిలో కంట్రోల్ రూమ్ లు ఏర్పాటుచేయడం జరిగిందని, ప్రజలకు అవసరమైన సహాయం అందించేందుకు పోలీసు సిబ్బంది సిద్ధంగా ఉన్నారన్నారు.
జిల్లా రెవిన్యూ అధికారి వి. విశ్వేశ్వరరావు, సబ్ కలెక్టర్ బొల్లిపల్లి వినూత్న, ఆర్డీఓలు అచ్యుత్ అంబరీష్, రమణ, తహసీల్దార్లు, ఎంపిడిఓలు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.