ఇష్టంతో చదివితే ఉన్నశిఖరాలు చేరుకోవచ్చు-జిల్లా కలెక్టర్ కె.వెట్రిసెల్వి వేలేరుపాడులోని కస్తూరిబా బాలికా విద్యాలయంను ఆకస్మికంగా తనిఖీ చేసిన కలెక్టర్
వేలేరుపాడు/ ఏలూరు, నవంబర్, 1 : కష్టంతో కాకుండా ఇష్టంతో చదివితే ఉన్నతశిఖరాలు చేరుకోవచ్చని జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి విద్యార్థినిలకు ఉద్బోధించారు. వేలేరుపాడులో కస్తూరిబా బాలికా విద్యాలయంను శనివారం కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేసి, విద్యార్థినిలకు బోధనా విధానాన్ని కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ వెట్రిసెల్వి మాట్లాడుతూ విద్యా ద్వారానే అభివృద్ధి సాధ్యమన్నారు. చదువును కష్టంతో కాక ఇష్టంతో చదివితే విజ్ఞానాన్ని మరింత పెంచుకుపోవచ్చన్నారు. ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకుని వాటిని సాదించేందుకు ఇష్టంతో కష్టపడి చదవాలని పాఠశాల స్థాయిలోనే ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకోవాలని, వాటిని సాదించేందుకు కృషి చేయాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యాభివృద్ధికి ఎంతో ప్రోత్సాహాన్ని అందిస్తున్నదని, ప్రభుత్వ పాఠశాలలో ఆహ్లాదకరమైన వాతావరణంలో విద్యనభ్యసించేలా విద్యార్థులకు ఎన్నో సౌకర్యాలను ప్రభుత్వం కల్పిస్తున్నదన్నారు. వాటిని సద్వినియోగం చేసుకుని వృద్ధిలోకి రావాలన్నారు. తరగతి గదిలో విద్యార్థినులు ఏ సబ్జెక్టు లలో వెనుకబడి ఉన్నారో తెలుసుకుని, వాటిలో ప్రత్యేక బోధనా తరగతులు నిర్వహించాలన్నారు. విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాల్సిన బాధ్యత ఉపాధ్యాయులపై ఉందన్నారు. ప్రతీ తరగతి గదిని పరిశీలించి, ఉపాధ్యాయులు బోధనను, విద్యార్థినుల విజ్ఞాన స్థాయిని కలెక్టర్ పరిశీలించారు. అనంతరం విద్యాలయం పరిసరాలను, పారిశుద్ధ్య పరిస్థితులను కలెక్టర్ పరిశీలించారు.
కలెక్టర్ వెంట జంగారెడ్డిగూడెం ఆర్డీఓ రమణ, ప్రభృతులు పాల్గొన్నారు.