Close

జిల్లా గ్రందాయాల సంస్థ భవనాన్ని జిల్లా జాయింట్ కలెక్టర్ డా. అభిషేక్ గౌడ బుధవారం ఆకస్మికంగా సందర్శించారు.

Publish Date : 12/11/2025

ఏలూరు, నవంబర్, 12 : జిల్లా గ్రందాయాల సంస్థ భవనాన్ని జిల్లా జాయింట్ కలెక్టర్ డా. అభిషేక్ గౌడ బుధవారం ఆకస్మికంగా సందర్శించారు. గ్రంథాలయ భవనoశిథిలావస్థ లో ఉన్నదని తెలిసి పరిస్థితులను అధ్యయనం చేసి త్వరలో గ్రంథాలయ నిర్వహణకు అనుకూలమైన వసతి అంశాన్ని జిల్లా కలెక్టర్ వారి దృష్టికి తీసుకువెళ్తామన్నారు. . అలాగే స్థానిక సంస్థల నుండి దీర్ఘకాలికంగా పెండింగ్లో ఉన్న గ్రంథాలయ సెస్ కూడా జమ అయ్యేవిధంగా తగు చర్యలు తీసుకుంటానన్నారు. ఈ సందర్భంగా జిల్లా కేంద్రంలోని వివిధ విభాగాలను పరిశీలించి, వివిధ కాంపిటేటివ్ పరీక్షలకు ప్రిపేర్ అయ్యే విద్యార్థిని విద్యార్థులను కలిసి కొంతసేపు సంభాషించారు. ఈ సందర్భంగా వారు గ్రంథాలయ సేవలను విసృత పరిచే విషయంలో విద్యార్థిని, విద్యార్థులకు ఎప్పుడు అందుబాటులో ఉంటానని అన్నారు
ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా గ్రంథాలయ సంస్థ కార్యదర్శి ఎమ్. శేఖర్ బాబు , సిబ్బంది ఎల్.వెంకటేశ్వరరావు కార్యాలయం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు