జిల్లాలో న్యుమోనియా కారణంగా మరణాలు సంభవించకూడదు పాఠశాలలు, సంక్షేమ వసతి గృహాలలో ప్రత్యేక స్క్రీనింగ్ క్యాంపులు నిర్వహించాలి-జిల్లా కలెక్టర్
ఏలూరు, నవంబర్, 12 : జిల్లాలో న్యుమోనియా వ్యాధి కారణంగా ఎటువంటి మరణాలు సంభవించకుండా చూడాలని జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి అధికారులను ఆదేశించారు. స్థానిక కలెక్టరేట్ లో బుధవారం సాయంత్రం న్యుమోనియా వ్యాధి నియంత్రణపై అధికారులతో కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ వెట్రిసెల్వి మాట్లాడుతూ జిల్లాలో న్యుమోనియా వ్యాధి నిర్మూలనపై అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని, న్యుమోనియా ని సమాజం నుండి తరిమివేయాలన్నారు. . న్యుమోనియా వ్యాధిపై సచివాలయ పరిధిలో సర్వే నిర్వహించాలని, ముఖ్యంగా జిల్లాలోని ప్రతీ ప్రభుత్వ పాఠశాలలు, సంక్షేమ వసతి గృహాలలో స్క్రీనింగ్ టెస్ట్ లు నిర్వహించాలన్నారు. న్యుమోనియా వ్యాధి లక్షణాలపై ప్రజలకు అవగాహన కలిగించాలన్నారు.
ఈ సందర్భంగా న్యుమోనియా వ్యాధి నివారణపై ముద్రించిన పోస్టర్ ను కలెక్టర్ ఆవిష్కరించారు.
కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డా. పి.జె. అమృతం, జిల్లా వైద్యసేవల సమన్వయాధికారి డా. పాల్ సతీష్, డి.ఆర్. డి. ఏ ., పీడీ ఆర్. విజయరాజు, జిల్లా పరిషత్ సీఈఓ శ్రీహరి, ఐ సి డి ఎస్ పీడీ శారద, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.