సుజల్ గ్రామ సంవాద్”– ప్రజా చర్చా వేదిక
గ్రామీణ నీటి భద్రత, శుద్ధ తాగునీటి ప్రాధాన్యత మరియు సమాజం ఆధారిత నీటి వనరుల నిర్వహణపై అవగాహన కల్పించేందుకు మినిస్టరి ఆఫ్ జల శక్తి, జల జీవన్ మిషన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వారు మంగళవారం “సుజల్ గ్రామ సంవాద్ ” వర్చువల్ కార్యక్రమం ద్వారా నిర్వహించబడింది. ఈ వర్చువల్ సమావేశంలో జిల్లా కలెక్టర్లు, జిల్లా మరియు విభాగాధికారులు, నీటి నిపుణులు, స్వచ్ఛంద సంస్థలు, VWSC గ్రామస్థాయి కమిటీ సభ్యులు పాల్గొని గ్రామ స్థాయి నీటి సమస్యలు, పరిష్కారాలు మరియు ఉత్తమ పద్ధతులపై సమగ్రంగా చర్చించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కె. వెట్రి సెల్వి మాట్లాడుతూ జిల్లాలో నిర్వహిస్తున్న వివిధ త్రాగునీటి నాణ్యత పరీక్షలు గురించి వివరించారు. ప్రతి నెల మూడో శనివారం నిర్వహించే “స్వచ్చ ఆంధ్ర – స్వర్ణ ఆంధ్ర” కార్యక్రమంలో భాగంగా పారిశుధ్యం, నీటి నిర్వహణ మరియు సంరక్షణ చర్యల ప్రాధాన్యతను తెలియజేశారు. అంతేకాక, ఎనమదల గ్రామం “హర్ ఘర్ జల్” గ్రామంగా ప్రకటించబడినదని సమావేశంలో వెల్లడించారు.
ఈ “సుజల్ గ్రామ సమ్వాద్” యొక్క ప్రధాన ఉద్దేశాలు :
ప్రతి గ్రామానికి సురక్షిత తాగునీటి హామీపై అవగాహన పెంచడం,
నీటి నిర్వహణ, సోర్స్ ప్రొటెక్షన్, సానిటేషన్కు సంబంధించిన ఉత్తమ పద్ధతులను పంచుకోవడం,.
గ్రామస్థాయి కమిటీలు, నాయకులు, ప్రజల నుండి నేరుగా అభిప్రాయాలు సేకరించడం,
గ్రామ నీటి భద్రత కోసం కార్యాచరణ ప్రణాళిక రూపొందించడం.
ఈ కార్యక్రమంలోభాగంగా మన జిల్లాలోని నూజివీడు మండలం – ఎనమదల గ్రామాన్ని ఎంపిక చేసి అక్కడి VWSC కమిటీ సభ్యులతో నీటి సరఫరా మరియు నాణ్యత గురించి చర్చించారు.
ఈ కార్యక్రమంలో RWS సూపరింటెండింగ్ ఇంజినీర్ శ్రీ జి. త్రినాధ్ బాబు గారు, నూజివీడు మండలంలోని ఎనమదల సర్పంచ్, VWSC కమిటీ సభ్యులు, AWC స్కూల్ టీచర్, ANM, ASHA, స్కూల్ పిల్లలు పాల్గొన్నారు.