Close

చివాలయం నందు డిసెంబర్ నెల 1వ తేది NTR భరోసా పింఛను పంపిణిలో భాగంగా హెల్త్ పెన్షన్ (CKDu) ను పెన్షన్ దారుని ఇంటివద్దనే పంపిణి చేయటం జరుగుతుందని జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి తెలియజేసారు.

Publish Date : 30/11/2025

ఏలూరు, నవంబర్, 30 : జిల్లలో రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ఉంగుటూరు మండలం లోని గోపినాధపట్నం సచివాలయం నందు డిసెంబర్ నెల 1వ తేది NTR భరోసా పింఛను పంపిణిలో భాగంగా హెల్త్ పెన్షన్ (CKDu) ను పెన్షన్ దారుని ఇంటివద్దనే పంపిణి చేయటం జరుగుతుందని జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి తెలియజేసారు. తదనంతరం నల్లమాడు గ్రామము నందు ప్రజావేదిక కార్యక్రమము నిర్వహించడం జరుగుతుందన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న NTR భరోసాపించను పధకము డిసెంబర్ నెల పింఛను చెల్లింపులు డిసెంబర్, 1వ తేదీ ఉదయం 7 గంటలకు ప్రారంభం అవుతుందని, . ఏలూరు జిల్లా లో డిసెంబర్ నెలలో 2,59,688 మంది ఫించన్ దారులకు 113.63 కోట్ల రూపాయిలు పంపిణీ చేయడం జరుగుతుందని, . జిల్లా లో ఫించన్ లు పంపిణీ 1 వ తేదీన 100 శాతం పంపిణీ చేయుటకు చర్యలు తీసుకొనటం జరిగిందన్నారు. . అనివార్య కారణం ల చేత 1 వ తేదీన తీసుకోని వారికి 3 వ తేదీ న పంపిణీ చేయబడునని, .జిల్లా లో 5039 మంధి సచివాలయ మరియు ఇతర ప్రభుత్వ సిబ్బంది తో పెన్షన్ల పంపిణీకి ఏర్పాటుచేయడం జరిగిందన్నారు.
సచివాలయ సిబ్బంది ద్వారా ఉదయం 7.00 గంటల నుండి పించను పంపిణి జరిగే విధముగా చర్యలు తీసుకోవాలని, పింఛను పొందేందుకు పింఛను దారులు వారి సంబంధిత ఇళ్లలో అందుబాటులో ఉండేలా ముందస్తు సమాచారం అందించాలని జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ ప్రొజెక్ట్ డైరెక్టర్ ను ఆదేశించడం జరిగిందని కలెక్టర్ వెట్రిసెల్వి చెప్పారు. .