ఉంగుటూరు మండలం రాష్ట్ర ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లను జిల్లా కలెక్టరు కె.వెట్రిసెవ్వి, జిల్లా ఎస్సీ కె.ప్రతాప్ శివ కిషోర్, ముఖ్యమంత్రి కార్యాలయం అధికార్లు, సంబంధిత అధికారులతో కలిసి పరిశీలించారు.
ఏలూరు/ఉంగుటూరు, నవంబరు 29: ఉంగుటూరు మండలంలో రాష్ట్ర ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లను శనివారం సాయత్రం జిల్లా ఎస్సీ కె.ప్రతాప్ శివ కిషోర్, ముఖ్యమంత్రి కార్యాలయ అధికారులు, సంబంధిత అధికారులులతో కలసి జిల్లా కలెక్టరు కె.వెట్రిసెల్వి పరిశీలించారు. ఉంగుటూరు మండలం గొల్లగూడెం హెలిప్యాడ్, నల్లమాడు ప్రజావేదిక మరియు కేడరు సమావేశ సభాస్థలి, గోపినాథపట్నం యన్టీఆర్ బరోసా సామాజిక పింఛన్లు లబ్ధిదారులు గృహాలను, తదితర ప్రాంతాలను పరిశీలించి, అధికారులకు దిశానిర్దేశం చేశారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టరు కె.వెట్రిసెవ్వి మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు డిసెంబరు 01వ తేదీన (సోమవారం) ఉంగుటూరు మండలం పర్యటన ఖరారు అయిన నేపథ్యంలో యుద్ధప్రాతిపదికన ఏర్పాట్లును ఆదివారం సాయంత్రానికి పూర్తిచేస్తామని అన్నారు. ఉంగుటూరు మండలం గొల్లగూడెం హెలిప్యాడ్, నల్లమాడు ప్రజావేదిక మరియు కేడర్ సమావేశ సభాస్థలి, గోపినాథ పట్నం యన్టీఆర్ బరోసా సామాజిక పింఛన్లు పంపిణీ మరియు లబ్ధిదారులు గృహాలు, తదితర ప్రాంతాలను పరిశీలించామని తెలిపారు. ఏక్కడ ఏఒక్క చిన్న పొరపాటు జరగకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తున్నామని అన్నారు. వివిధ శాఖల అధికారులు కేటాయించిన పనులు పూర్తి చెయ్యుటలో నిమగ్నమై ఉన్నారని, ఎట్టి పరిస్థితుల్లోనూ ఆదివారం సాయంత్రానికి పూర్తి చెయ్యాలని అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశామని అన్నారు.
జిల్లా ఎస్పీ కె.ప్రతాప్ శివ కిషోర్ మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి పర్యటన అసాధారణ భద్రతా ఏర్పాట్లను పూర్తి చేస్తున్నామన్నారు. హెలిప్యాడ్, లబ్ధిదారులకు పింఛన్లు పంపిణీ గృహాలు, ప్రజావేదిక, తదితర ప్రాంతాలు, ముఖ్యమంత్రి పర్యటన ప్రదేశాలకు, కాన్వాయ్ మార్గాలను క్షుణ్ణంగా తనిఖీ చేసి జల్లెడ పట్టామని అన్నారు. పర్యటనలో ఏటువంటి అంతరాయం లేకుండా విజయవంతంగా సాగేందుకు భద్రతా ఏర్పాట్లును కట్టుదిట్టం చేశామని అన్నారు. పర్యటన పూర్తయ్యేంత వరకు నిరంతరం భద్రతా చర్యలు కొనసాగుతాయని తెలిపారు.
జిల్లా కలెక్టరు వెంట జిల్లా జాయింటు కలెక్టరు యం.జె.అభిషేక్ గౌడ, ముఖ్యమంత్రి కార్యాలయ అధికారులు, ఏఎస్పీలు నక్కా పూర్ణచంద్రరావు, ఆర్.సుస్మిత,
ఏలూరు ఆర్డీవో యం.అచ్యుత అంబరీష్, డిఎస్పీ లు, జిల్లా, మండల వివిధ శాఖల అధికారులు, తదితరులు పాల్గొన్నారు.