Close

జిల్లాలో ఈనెల 21 నుండి 23 వరకు జరగనున్న పల్స్ పోలియో కార్యక్రమానికి పటిష్టమైన ఏర్పాట్లు చేయాలనీ జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి అధికారులను ఆదేశించారు.

Publish Date : 11/12/2025

ఏలూరు, డిసెంబర్, 11 : జిల్లాలో ఈనెల 21 నుండి 23 వరకు జరగనున్న పల్స్ పోలియో కార్యక్రమానికి పటిష్టమైన ఏర్పాట్లు చేయాలనీ జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి అధికారులను ఆదేశించారు. స్థానిక కలెక్టరేట్ లో గురువారం పల్స్ పోలియో కార్యక్రమం ఏర్పాట్లపై జిల్లా టాస్క్ ఫోర్స్ కమిటీ సమావేశంలో అధికారులతో కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ వెట్రిసెల్వి మాట్లాడుతూ జిల్లాలో 5 సంవత్సరాలలోపు 2 లక్షల 4 మంది చిన్నారులు ఉన్నారని, వీరిలో గ్రామీణ ప్రాంతంలో లక్షా 49 వేల 470 మంది, పట్టణ ప్రాంతాలలో 29 వేల 827 మంది, గిరిజన ప్రాంతాలలో 20 వేల 707 మంది చిన్నారులు ఉన్నారన్నారు. వారికి అవసరమైన వాక్సిన్ డోసులు సిద్ధం చేయాలన్నారు. ఈనెల 21వతేదీన ప్రతీ చిన్నారికీ 1707 వ్యాక్సినేషన్ కేంద్రాలు , 72 మొబైల్ కేంద్రాలు ద్వారా పల్స్ పోలియో వాక్సిన్ అందించేలా పటిష్టమైన ప్రణాళికతో ఏర్పాట్లు చేయాలన్నారు. ఆర్టీసీ బస్సు స్టాండ్లు, రైల్వే స్టేషన్ల వద్ద కూడా పల్స్ పోలియో కేంద్రాలు ఏర్పాటుచేసి పోలియో వాక్సిన్ వేయాలన్నారు. అనంతరం 22, 23 వ తేదీలలో ఇంటింటికీ వెళ్లి పోలియో వాక్సిన్ తీసుకొని చిన్నారులను గుర్తించి, వారికి వారి ఇంటివద్దే వాక్సిన్ అందించేలా చర్యలు తీసుకోవాలన్నారు. పోలియో వాక్సిన్ ప్రతీ చిన్నారికి వేసేలా వాక్సిన్ వేసే తేదీ, సమయం, కేంద్రం వివరాలు గ్రామాలలో టాంటాం ప్రజలకు తెలియజేయాలన్నారు. ఈనెల 21వ తేదీన పల్స్ పోలియో కార్యక్రమంపై ప్రతీ ప్రభుత్వ ఆసుపత్రి పరిధిలో, అంగన్వాడీ కేంద్రాలు, ప్రభుత్వ కార్యాలయాలు, ప్రధాన కూడళ్ల వద్ద విస్తృత ప్రచారం నిర్వహించాలన్నారు. పల్స్ పోలియో కార్యక్రమం విజయవంతంగా నిర్వహించేందుకు స్వయం సహాయక సంఘాల సభ్యులు, అంగన్వాడీ సిబ్బంది , మహిళా మండలి సభ్యులు, స్థానిక ప్రముఖులను భాగస్వాములు చేయాలన్నారు. వ్యాక్సినేషన్ ప్రక్రియపై సిబ్బందికి ముందస్తుగా శిక్షణ అందించాలన్నారు. వ్యాక్సినేషన్ కేంద్రాలకు ముందు రోజు వాక్సిన్ చేర్చేందుకు అవసరమైన రవాణాకు అవసరమైన వాహనాలు సిద్ధం చేయాలనీ, వాక్సిన్ నిల్వ చేసే కేంద్రాల పరిధిలో విద్యుత్ సరఫరాకు అంతరాయం లేకుండా చూడాలన్నారు. ఈ సందర్భంగా పల్స్ పోలియోపై ముద్రించిన వాల్ పోస్టర్లను జిల్లా కలెక్టర్ ఆవిష్కరించారు.
సమావేశంలో డిఎంహెచ్ఓ డా. పి .జె. అమృతం, డిసిహెచ్ ఎస్ డా. పాల్ సతీష్, జిల్లా పరిషత్ డిప్యూటీ సీఈఓ భీమేశ్వరరావు, డిఆర్డిఏ పీడీ ఆర్. విజయరాజు, ట్రాన్స్కో ఎస్ఈ సాల్మన్ రాజు, డీఈఓ వెంకటలక్ష్మమ్మ, ఐసిడిఎస్ పీడీ శారద, ఆర్టీసీ ఆర్ఎం షబ్నమ్, డెమో శ్రీనివాస్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.