Close

ఆంధ్రరాష్ట్ర సాధనకు ప్రాణాలు అర్పించిన అమరజీవి పొట్టి శ్రీరాములు స్ఫూర్తిదాయకం. జిల్లా కలెక్టరు కె.వెట్రిసెల్వి .

Publish Date : 15/12/2025

ఏలూరు, డిసెంబరు 15: జిల్లా కలెక్టరేటు గోదావరి సమావేశ మందిరంలో సోమవారం అమరజీవి పొట్టి శ్రీరాములు వర్ధంతి సందర్భంగా చిత్రపటానికి జిల్లా కలెక్టరు కె.వెట్రిసెల్వి పూలమాలలు వేసి, ఘనంగా నివాళులర్పించారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టరు కె.వెట్రిసెల్వి మాట్లాడుతూ పొట్టి శ్రీరాములు వర్ధంతిని ప్రతి సంవత్సరం డిసెంబరు 15వ తేదీన రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ అధికారికంగా ఆత్మర్పణ దినోత్సవంగా నిర్వహించు కుంటున్నామన్నారు. ఆంధ్రరాష్ట్ర సాధన కొరకు ఆమరణ నిరాహార దీక్ష చేసి ప్రాణాలర్పించిన అమరజీవి పొట్టి శ్రీరాములు ఆంధ్రులకు చిరస్మరణీయం, స్ఫూర్తిదాయకం అన్నారు. మహాత్మాగాంధీ బోధించిన సత్య, అహింస, హరిజనోద్దరణ ఆశయాలు కోసం జీవితాంతం కృషిచేసిన పొట్టి శ్రీరాములు మహానీయులు అన్నారు.1930 సంవత్సరంలో ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొని జైలు శిక్ష అనుభవించారని, భారతదేశ స్వాతంత్ర్య ఉద్యమంలో పాల్గొన్న గొప్ప యోధుడు అన్నారు. ఆంధ్రులు చిరకాల స్వప్నమైన ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించేందుకు 58 రోజులు పాటు ఆమరణ నిరాహార దీక్షచేసి ప్రాణ త్యాగానికి పూనుకుని అమరజీవి అయిన పొట్టి శ్రీరాములు మనందరికీ మార్గదర్శకులు అన్నారు.

ఈ కార్యక్రమంలో జిల్లా జాయింటు కలెక్టరు యం.జె. అభిషేక్ గౌడ, జిల్లా రెవిన్యూ అధికారి వి.విశ్వేశ్వర రావు, ఆర్డీవో యం.అచ్యుత అంబరీష్, కెఆర్ఆర్ సి డిప్యూటీ కలెక్టరు యల్.దేవకీ దేవి, జిల్లా వివిధ శాఖల అధికారులు, తదితరులు పాల్గొన్నారు.