Close

జనవరి నెల సామజిక పెన్షన్లు డిసెంబర్, 31వ తేదీనే పంపిణీ- జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి

Publish Date : 27/12/2025

ఏలూరు, డిసెంబర్, 27 : రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న NTR భరోసాపించను పధకము ఫించన్లు పంపిణీ ప్రభుత్వ ఆదేశంల ప్రకారం నూతన సంవత్సరం కారణంగా 1 వ తేది జనవరి, 2026 పంపిణి చేయవలసిన పెన్షన్లు ను ది. 31.12.2025 వ తేదీన ఉదయం 7 గంటల నుండి పంపిణీ చేయడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి ఒక ప్రకటనలో తెలిపారు. NTR భరోసాపించను పధకము జనవరి,2026 నెల పింఛను చెల్లింపులు 31.12.2025 ఉదయం 7.00 గంటలకు ప్రారంభం అవుతుందని, ఏలూరు జిల్లా లో జనవరి, 2026 నెలలో 2,59,151 మంది ఫించన్ దారులకు 113.68 కోట్ల రూపాయిలు పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. జిల్లా లో ఫించన్ లు పంపిణీ 31 వ తేదీన 100 శాతం పంపిణీ చేయుటకు చర్యలు తీసుకొనటం జరిగిందని, అనివార్య కారణం ల చేత 31 వ తేదీన తీసుకోని వారికి 2 వ తేదీ న పంపిణీ చేయబడుతుందన్నారు. జిల్లా లో 5039 మంధి సచివాలయ మరియు ఇతర ప్రభుత్వ సిబ్బంది తో ఫించనల పంపిణీకి ఏర్పాటులు చేయడమైనదని, సచివాలయ సిబ్బంది ద్వారా ఉదయం 7.00 గంటల నుండి పించను పంపిణి జరిగే విధముగా చర్యలు తిసుకోనవలసినదిగా డిఆర్డిఏ ప్రొజెక్ట్ డైరెక్టర్ ను కలెక్టర్ ఆదేశించారు. పింఛను పొందేందుకు పింఛను దారులు వారి సంబంధిత ఇళ్లలో అందుబాటులో ఉండేలా సచివాలయ సిబ్బంది ద్వారా ముందస్తు సమాచారం అందించాలని కలెక్టర్ వెట్రిసెల్వి డిఆర్డిఏ ప్రొజెక్ట్ డైరెక్టర్ విజయరాజును ఆదేశించారు.