Close

ప్రభుత్వ పాఠశాలల్లో ‘100 రోజుల ప్రణాళిక’ అమలుపై అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టాలి జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి

Publish Date : 29/12/2025

ఏలూరు, డిసెంబర్, 29 : జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాల స్థాయి మెరుగుపరిచి, నూరుశాతం ఉతీర్ణత సాదించేందుకు రూపొందించిన ‘100 రోజుల ప్రణాళిక’ అమలుపై అధికారులు ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాలని జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి అధికారులను ఆదేశించారు. స్థానిక కలెక్టరేట్ లోని గౌతమీ సమావేశపు హాలులో సోమవారం ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాలు మెరుగుపరిచేందుకు ‘100 రోజుల ప్రణాళిక’ అమలుపై అధికారులతో కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ వెట్రిసెల్వి మాట్లాడుతూ జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో చక్కగా బోధించే ఉపాధ్యాయులు, చురుకైన విద్యార్థులు ఉన్నారని, అన్నివిధాలుగా ప్రోత్సహించే ప్రభుత్వ పధకాలు ఉన్నాయని, కానీ విద్యా ప్రగతిలో ఇంకా సాధించాల్సి ఎంతో ఉందన్నారు. విద్య ప్రాధాన్యత పట్ల, విద్య ద్వారా ఉన్నత స్థాయికి ఏ రకంగా చేరుకోవచ్చో అనే అంశాలపై విద్యార్థులలో ప్రేరణ కలిగిస్తే, మంచి ఫలితాలు ఉంటాయన్నారు. ముఖ్యంగా తరగతుల వారీగా విద్యార్థుల విద్యా సామర్ధ్య స్థాయి లను తెలుసుకుని, విద్యలో వెనుకబడిన విద్యార్థులు ఏ ఏ సబ్జెక్టు లలో వెనుకబడి ఉన్నారు, అందుకు గల కారణాలు, విద్యపై ఆసక్తి తగ్గేందుకు కుటుంబ కారణాలు ఏమైనా ఉన్నాయా వంటి సామజిక అంశాలను కూడా తెలుసుకోవాలన్నారు. వారిపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించి వెనుకబడిన సబ్జెక్టు లలో ఉతీర్ణత చెందేలా వారికి విద్యపై ఆసక్తి కలిగించేలా జిల్లాలో ‘100 రోజుల ప్రణాళిక’ ను రూపొందించామని, ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులను స్వచ్చందంగా భాగస్వాములను చేశామన్నారు. ఈ కార్యక్రమం ద్వారా ఆయా అధికారులు తాము ఎంచుకున్న పాఠశాలలో విద్యార్థుల విద్యా సామర్ధ్య స్థాయిని పర్యవేక్షించి, విద్యార్థుల సామర్ధ్య స్థాయిని మెరుగుపరిచేందుకు కృషి చేయాలన్నారు. . ‘100 రోజుల ప్రణాళిక’ కార్యక్రమంలో భాగస్వాములై, జిల్లాలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో నూరు శాతం ఉతీర్ణత సాధన దిశగా చేపట్టిన ‘100 రోజుల ప్రణాళిక’ విజయవంతంగా అమలు చేసి విద్యాభివృద్ధిలో ఏలూరు జిల్లాను ముందు వరస లో నిలిపి ఉత్తమ ఫలితాలు సాధనకు కృషిచేసిన వారిని సన్మానించి గౌరవిస్తామని కలెక్టర్ చెప్పారు.

సమావేశంలో డిఈఓ వెంకటలక్ష్మమ్మ, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.