Close

అక్షర ఆంధ్ర కార్యక్రమం ద్వారా జిల్లాలో నిరక్షరాస్యులను అక్షరాస్యులుగా తీర్చిదిద్దాలని జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి అధికారులను ఆదేశించారు.

Publish Date : 04/02/2026

ఏలూరు, ఫిబ్రవరి, 4 : అక్షర ఆంధ్ర కార్యక్రమం ద్వారా జిల్లాలో నిరక్షరాస్యులను అక్షరాస్యులుగా తీర్చిదిద్దాలని జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి అధికారులను ఆదేశించారు. ఏలూరు మండలం మాదేపల్లి లోని అక్షరాస్యత కేంద్రంలో అక్షర ఆంధ్ర కార్యక్రమం ద్వారా వయోజనులకు చేపట్టిన అక్షరాస్యత బోధనను బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేసి పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ వెట్రిసెల్వి మాట్లాడుతూ అక్షర ఆంధ్ర కార్యక్రమం ద్వారా జిల్లాలో అక్షరాస్యత పెరుగుదలకు చర్యలు తీసుకోవాలన్నారు. అక్షర ఆంధ్ర కార్యక్రమం ద్వారా జిల్లాలోని 97 వేల 200 మందికి అక్షరాస్యత, ఆర్ధిక, డిజిటల్ అక్షరాస్యత అందించడం లక్ష్యంగా నిర్ణయించామని, ఇందుకు సంబంధించి అభ్యాసకులు వివరాలు యాప్ లో సంబంధిత సచివాలయ సిబ్బంది నమోదు చేయాలన్నారు. గ్రామ/వార్డ్ సచివాలయ సిబ్బంది, డిఆర్డిఏ , డ్వామా సిబ్బంది అక్షర ఆంధ్ర కార్యక్రమం విజయవంతంగా పూర్తిచేసేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. వయోజనులకు పాఠాలు చెప్పి, చదివించి, పరీక్షలు వ్రాయించి, పాస్ చేయించాలన్నారు. కేంద్రంలో పాల్గొన్న సుమారు 30 మంది వయోజనులను కలిసి అక్షరాస్యులుగా మారుతున్నందుకు వారి అభిప్రాయాలను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు.

కలెక్టర్ వెంట జిల్లా వయోజన విద్య డిడి జి.సి.హెచ్.ప్రభాకర్, తహశీల్దారు జి. విజయ కుమార్, ఇంచార్చి యంపిడివో డి. శ్రీనివాస రావు, వాలంటీర్ టీచర్లు పుట్టి విద్య, బంధుల భవాని, గుడిపూడి కావ్య, కూర్మ వెంకటేశ్వరమ్మ, తదితరులు పాల్గొన్నారు