Close

ఆస్థి పన్నుల వసూళ్లను వేగవంతం చేయాలనీ జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి అధికారులను ఆదేశించారు.

Publish Date : 18/02/2026

ముసునూరు, ఫిబ్రవరి, 18 : ఆస్థి పన్నుల వసూళ్లను వేగవంతం చేయాలనీ జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి అధికారులను ఆదేశించారు. స్థానిక ఎంపిడిఓ కార్యాలయంను బుధవారం కలెక్టర్ ఆకస్మిక తనిఖీ నిర్వహించి రికార్డులను పరిశీలించారు. ఆస్థి పన్ను, పారిశుద్ధ్యం, యూనిఫైడ్ ఫామిలీ సర్వే, తదితర అంశాలపై అధికారులతో కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ వెట్రిసెల్వి మాట్లాడుతూ ముసునూరు మండలంలో ఆస్తిపన్నుల వసూళ్లు అతి తక్కువగా ఉండటంతో అధికారులపై కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆస్థి పన్ను బకాయిలు, ప్రస్తుత సంవత్సరం పన్నులను ఈ నెలాఖరులోగా పూర్తిగా వసూలు చేయాలని, నిర్లక్ష్యం వహించే అధికారులపై చర్యలు తీసుకుంటామన్నారు. సచివాలయ సిబ్బంది పన్ను వసూళ్లపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాలన్నారు. అదే సమయంలో యూనిఫైడ్ ఫామిలీ సర్వే పూర్తి చేయాలన్నారు. మండలంలో రోడ్లపై ఎక్కడా చెత్త కనిపించకూడదని, ప్రతీరోజు ఇంటింటికి వెళ్లి చెత్తను సేకరించి, అదేరోజు డంపింగ్ యార్డుకు తరలించాలన్నారు. మండలంలో పీ4 కార్యక్రమంలో గుర్తించిన బంగారు కుటుంబాలను మార్గదర్సులతో అనుసంధానం చేసి, బంగారు కుటుంబాలు విద్యా, సామజిక, ఆర్థికపరంగా అభివృద్ధిపదంలో నిలిచేలా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రజల నుండి వారి సమస్యలపై అందిన విజ్ఞప్తులను నిర్ణీత సమయంలోగా పరిష్కారానికి చర్యలు తీసుకోవాలన్నారు.

సబ్ కలెక్టర్ బొల్లిపల్లి వినూత్న, జిల్లా పరిషత్ సీఈఓ శ్రీహరి,జిల్లా పంచాయతీ అధికారి కె. అనురాధ, డీఈఓ వెంకటలక్ష్మమ్మ, ఎంపిడిఓ ఏసుబాబు, , ప్రభృతులు పాల్గొన్నారు.