Close

ఉపాధ్యాయురాలిగా బోధనచేసి విద్యార్థులతో మమేకమైన జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి

Publish Date : 17/02/2026

ఏలూరు, ఫిబ్రవరి, 17 : నులి పురుగుల మాత్రల పంపిణీలో భాగంగా మంగళవారం వెంకటరావుపేట స్పెషల్ నగరపాలక సంస్థ ప్రాధమిక పాఠశాలలో 5వ తరగతి గదికి వెళ్లి విద్యార్థులకు ఉపాధ్యాయులు పాఠాలను బోధించే విధానాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులతో మమేకమయ్యారు. వారితో కలిసి మాట్లాడారు. పాఠ్య పుస్తకాలలో అంశాలను గురించి విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. కొంతసేపు ఉపాధ్యాయునిగా మారి విద్యార్థులకు పాఠాలు బోధించారు. వారితో సరదాగా మాట్లాడుతూ వారి విద్యా స్థాయిని పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ వెట్రిసెల్వి మాట్లాడుతూ ఉపాధ్యాయ వృత్తికి వన్నె తెచ్చేలా ఉపాధ్యాయులు విద్యా బోధన చేయాలన్నారు. ప్రతీ విద్యార్ధీ ఇష్టంతో విద్య అభ్యసించేలా ఉపాధ్యాయులు బోధన చేయాలన్నారు. విద్యార్థులతో మమేకమై వారికి ఇష్టమైన రీతిలో విద్యా బోధనా చేయాలన్నారు. తరగతి గదిలో ఏ విద్యార్థి, ఏ సబ్జెక్టు లో వెనుకబడి ఉన్నాడో తెలుసుకుని, ఆ సబ్జెక్టు ను వారికి పూర్తిగా అర్ధమయ్యే రీతిలో విద్యాబోధన చేయాలన్నారు. విద్యార్థుల ఉజ్వల భవిషత్తు ఉపాధ్యాయుల చేతిలో ఉందని, ఉత్తమమైన బోధన ద్వారా ప్రతిభావంతులుగా తీర్చిదిద్దే బాధ్యత ఉపాధ్యాయులపై ఉందన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాల స్థాయిని పెంపొందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో పధకాలు అమలు చేస్తున్నదని, వాటిని విద్యార్థులు సద్వినియోగం చేసుకుని ఉన్నత స్థాయికి చేరుకునేలా ఉపాద్యాయులు కృషి చేయాలనీ, అలాంటి వారిని విద్యార్థులు జీవితాంతం గుర్తుంచుకుంటారన్నారు.

ఈ కార్యక్రమంలో డీఈఓ వెంకటలక్ష్మమ్మ, RBSK జిల్లా ప్రోగ్రామ్ అధికారి డా: నరేంద్ర కృష్ణ , తహసీల్దార్ గాయత్రి, ప్రభృతులు పాల్గొన్నారు.